Advertisement
తెలుగు న్యూస్

నాలుగో పెళ్లి లేదు: వనిత

ఇప్పటికే మూడు సార్లు పెళ్లి చేసుకొంది నటి వనితా విజయ్‌కుమార్‌. మంజుల, విజయ్ కుమార్ ల కూతురు వనిత. ‘దేవి’ వంటి తెలుగు సినిమాల్లో నటించింది. గతేడాది కరోనా సంక్షోభంలో ఆమె మూడో పెళ్లి చేసుకొంది. అది మూన్నాళ్ల ముచ్చటే అయింది.

ఇప్పుడు నాలుగో పెళ్లి చేసుకోనుందని ప్రచారం మొదలైంది. ఐతే, అలాంటి ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చింది వనితా విజయ్ కుమార్. ఇలాంటి ప్రచారం చేయకండి అంటూ వేడుకొంటోంది.

ఆమెకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. “ఇకపై పిల్లలే నా జీవితం. గతంలో చేసిన తప్పులు చెయ్యను. నా వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలు సృష్టించకండి,” అని రాసుకొంది.

Advertisement

This post was last modified on June 12, 2021 8:42 pm

Advertisement
Share