వారణాసి టైటిల్ కాదన్నట్లే

మహేష్ బాబు – రాజమౌళి సినిమాకి “వారణాసి” అనే టైటిల్ ఖరారు అయింది అని ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ హడావిడి జరిగింది. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులు ఎక్కువగా ఆ వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమాని “గ్లోబల్ ట్రాటర్” అని పిలుస్తున్నారు. కానీ సినిమాకి అసలైన టైటిల్ ఏంటనేది ఈ నెల 15న తెలుస్తుంది.

రామోజీ ఫిలిం సిటీలో ఈ నెల 15న టైటిల్ గ్లిమ్ప్స్ విడుదల కార్యక్రమం పెట్టుకొంది టీం. అప్పటివరకు ఏ పేర్లు ప్రచారంలోకి వచ్చినా అవి ఊహాగానాలే.

ఇక తాజాగా రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతోన్న ఒక చిన్న చిత్రానికి “వారణాసి” అనే పేరు పెట్టి, దాని రిజిస్టర్ చేయించి పోస్టర్ వదిలారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభిస్తామని ఆ టీం ప్రకటించింది. ఒకవేళ ఈ సంస్థ నిజంగానే “వారణాసి” అనే టైటిల్ రిజిస్టర్ చేయించి ఉంటే రాజమౌళి సినిమాకి ఆ పేరు పెట్టుకోవడం కుదరదు. లేదా ఈ సంస్థ నుంచి రాజమౌళి టీం టైటిల్ కొనుక్కోవాలి.

ఇంతకీ రాజమౌళి ఇదే టైటిల్ అనుకుంటున్నారా లేక ఇంతకుముందు పరిశీలించిన “మహారాజ్” టైటిల్ పెడుతారా. సస్పెన్స్ వీడాలంటే నవంబర్ 15 వరకు ఆగాల్సిందే.

TeluguCinema

TeluguCinema

  • News

‘Chennai Love Story’ receives UA certificate, buzz is impressive

Kiran Abbavaram's upcoming romantic drama “Chennai Love Story” has completed its censor formalities, with the…

12 hours
  • News

Ravi Teja begins dubbing for Shiva Nirvana’s Irumudi

Ravi Teja has started dubbing for his upcoming emotional family drama “Irumudi,” directed by Shiva…

12 hours
  • News

‘Raave Cheliya’ from Srinivasa Mangapuram released

The makers of “Srinivasa Mangapuram” have unveiled "Raave Cheliya” song from the film ahead of…

12 hours
  • News

Prabhas and Yash set a new release trend among top South stars

Prabhas and Yash have emerged as the only leading South Indian stars to release two…

12 hours
  • News

‘Raasa Gummadi’ from Korean Kanakaraju: The song is filled with folk beats

Varun Tej's upcoming horror-comedy “Korean Kanakaraju” is gearing up for its theatrical release on August…

13 hours
  • News

ZEE5 officially confirms NBK111 and Vrushakarma acquisitions

ZEE5 has officially announced the acquisition of the digital streaming rights for Nandamuri Balakrishna's upcoming…

13 hours