Advertisement
తెలుగు న్యూస్

వరుణ్ తేజ్ కి రెండో దెబ్బ!

వరుణ్ తేజ్ కి టైం కలిసి రావడం లేదు.మరో సినిమా తేడా కొట్టేసింది. హిట్, ఫ్లాప్ పక్కన పెడితే సరైన ఓపెనింగ్ రాకపోవడం వరుణ్ తేజ్ కి పెద్ద మైనస్.

వరుణ్ తేజ్ హీరోగా నటించిన “గాండీవధారి అర్జున” నిన్న విడుదలైంది. ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన ఓపెనింగ్ చాలా తక్కువ. వరుణ్ తేజ్ వంటి మిడ్ రేంజ్ హీరో సినిమాకి సాలిడ్ ఓపెనింగ్ రావాలి. కానీ, దీనికి వచ్చిన కలెక్షన్లు చూసి వరుణ్ కూడా షాక్ అయ్యారట.

“గాండీవధారి అర్జున”కి పెద్ద హైప్ ఏమి లేదు. కాకపోతే, ట్రైలర్ బాగుండడం, సినిమా రిచ్ గా కనిపిస్తుండడంతో జనం థియేటర్లకు వస్తారని భావించారు. కానీ జనం మాత్రం టాక్ బాగుంటే టికెట్లు బుక్ చేసుకుందాం లే అన్నట్లుగా ప్రవర్తించారు. అందుకే మొదటి రోజు అంత తక్కువ ఓపెనింగ్ వచ్చింది.

వరుణ్ తేజ్ ఈ ఏడాది డిసెంబర్ లో “ఆపరేషన్ వాలెంటైన్” అనే సినిమాతో మన ముందుకు రానున్నాడు. అలాగే “మట్కా” అనే సినిమా కూడా ఒప్పుకున్నాడు. ఈ రెండు సినిమాలతో వరుణ్ తేజ్ పుంజుకుంటాడా అన్నది చూడాలి.

Advertisement

This post was last modified on August 26, 2023 2:44 pm

Advertisement
Share