Advertisement
తెలుగు న్యూస్

వరుణ్ తేజ్ నిర్ణయం తీసుకోవాలి!

వరుణ్ తేజ్ నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ డిసెంబర్ 8న విడుదల కావాలి. తెలుగుతో పాటు హిందీలో భారీ ఎత్తున విడుదల కానున్న ఈ సినిమాని సోని సంస్థ నిర్మిస్తోంది. గ్లోబల్ లెవల్లో పెద్ద నిర్మాణ సంస్థ అది. ఒకసారి సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత మార్చేందుకు అంతగా ఇంటరెస్ట్ చూపవు అలాంటి సంస్థలు.

ఐతే, ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది అని, అందుకే ఇంకా ప్రమోషన్ ని స్టార్ట్ చెయ్యడం లేదనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో వరుణ్ తేజ్ టీంకి కూడా ఐడియా లేదు.

ఇటీవలే తన ప్రియురాలు లావణ్యను పెళ్లాడిన వరుణ్ ఇక సోని సంస్థతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాడు. వాయిదా వెయ్యడమా లేక ఇంతకుముందు చెప్పిన డేట్ కే విడుదల చేయడమా అన్న విషయంలో ఒక డెసిషన్ కి వస్తాడు వరుణ్.

వరుణ్ తేజ్ ఈ సినిమాలో వైమానిక సైనికుడిగా నటించాడు. దేశభక్తితో కూడిన చిత్రం. అడివి శేష్ నటించిన “మేజర్” చిత్రం ఆడినట్లు ఇది కూడా హిందీ మార్కెట్ లో ఆడితే వరుణ్ తేజ్ తదుపరి చిత్రాల బిజినెస్ రేంజ్ పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాపై కొంచెం గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు వరుణ్.

Advertisement

This post was last modified on November 16, 2023 3:47 pm

Advertisement
Share