Advertisement
తెలుగు న్యూస్

వెంకీ సినిమాలన్నీ తారుమారు

ఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేద్దామనుకున్నారు వెంకటేష్. కానీ అనుకోకుండా మూడు సినిమాలు రెడీ చెయ్యాల్సి వచ్చింది. దృశ్యం 2, ఎఫ్ 3, నారప్ప… ఇలా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయ్. అందులో “దృశ్యం 2”, “నారప్ప” షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “ఎఫ్ 3” కూడా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తి అవుతుంది.

ఐతే, ఇందులో ఏ సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలి? ఒకే ఏడాది మూడు సినిమాలు రిలీజ్ చేస్తే.. జనం ఆదరిస్తారా? మూడు సినిమాలు ప్రోమోట్ చెయ్యాలంటే చిరాకు కదా? ఇలాంటి డౌట్స్ వెంకీని వేధిస్తున్నాయట. అందుకే, ఈ సీనియర్ స్టార్ తర్జన భర్జన పడుతున్నారు.

“దృశ్యం 2” సినిమాని డైరెక్ట్ గా ఓటిటిలోనే విడుదల చేసే అవకాశం ఉంది. అలా ఐతే, దానికి పెద్దగా ప్రమోషన్ అవసరం ఉండదు. మిగతా రెండు సినెమాల రిలీజ్ లు కూడా కోవిడ్ 19 తీవ్రత తగ్గాక, టైం గ్యాప్ చూసుకొని ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

This post was last modified on May 5, 2021 5:37 pm

Advertisement
Share