Advertisement
తెలుగు న్యూస్

మంచు విష్ణు ఏమి చేస్తాడు?


మంచు విష్ణుకి జీవిత షాక్ ఇచ్చినట్లే. ఆమె తన వైపు ఉంటుందని అనుకున్నారు విష్ణు. కానీ సడెన్ గా ఆమె ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేరిపోవడం ఒక ఝలక్ లాంటిదే. ఇదంతా “మా” ఎన్నికల గురించే.

“మా” ఎన్నికలు వచ్చే నెలలో జరగనున్నాయి. ప్రెసిడెంట్ గా పోటీ చేస్తామని ఇంతకుముందు ప్రకాష్ రాజ్, విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సీవీఎల్ ప్రకటించిన విషయం తెలుసు కదా. ఐతే, ఇప్పుడు జీవిత, హేమ పోటీ నుంచి తప్పుకొని ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో చేపిరిపోయారు. అంటే డైరెక్ట్ గా పోటీ విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్.

మంచు విష్ణు ఇప్పుడు తన ప్యానెల్ ని ప్రకటించాలి. గట్టి టీంని రెడీ చేసుకోవాలి. ఐతే, విష్ణుకి నందమూరి బాలకృష్ణ వర్గం గట్టి మద్దతు ఉంది. కొందరు పెద్ద హీరోలు కూడా అండగా ఉంటామని చెప్పారట. సో, విష్ణు నమ్మకంగా ఉన్నారు.

ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ రేసులో దూసుకుపోతున్నారు. విష్ణు ఇంకా దూకుడు చూపట్లేదు.

Advertisement

This post was last modified on September 4, 2021 9:27 am

Advertisement
Share