“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రాన్ని వాయిదా వేస్తే ఊరుకునేది లేదని ఆదివారం ఉదయం అల్టిమేటం ఇచ్చాడు హీరో విశ్వక్ సేన్. నిర్మాతకు అది అల్టిమేటం. నాని, నితిన్ వంటి హీరోల నుంచి వస్తున్న ఒత్తిడికి తట్టుకొని నిర్మాత నాగవంశీ తన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” చిత్రాన్నివాయిదా వేసేందుకు సన్నద్ధం అయ్యారని విశ్వక్ సేన్ గ్రహించాడు.
దాంతో, డిసెంబర్ 8 నుంచి సినిమాని తప్పిస్తే తాను ప్రమోట్ చెయ్యను అని సోషల్ మీడియా వేదిక నుంచి నిర్మాతకు అల్టిమేటం ఇచ్చాడు. కానీ నిర్మాత ఫోన్ చేసిన తర్వాత విశ్వక్ సేన్ చల్లబడ్డాడు. ఆదివారం నాడే తన సోషల్ మీడియా పోస్ట్ ని డిలిట్ చేశాడు.
ఇప్పుడు నిర్మాత తనకు నచ్చిన డేట్ కి సినిమాని విడుదల చేసేందుకు అంగీకరించాడని సమాచారం. నిర్మాత విశ్వక్ సేన్ ని ఎలా ఒప్పించాడో? తాను వంగితే వాళ్ళు మింగుతారు అని చెప్పిన విశ్వక్ సేన్ ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గాడో?
విశ్వక్ సేన్ కి ఆవేశం ఎక్కువ. కానీ సినిమా ఇండస్ట్రీలో ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యం. ఆవేశానికి, ఇగోకి పోయి… మిగతా మూడు సినిమాలతో (“ఆపరేషన్ వాలెంటైన్”, “హాయ్ నాన్న”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్ “) పోటీ పడితే తన చిత్రానికే నష్టం. ఇలాంటి విషయాలను జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలి. బహుశా నిర్మాత నాగవంశీ ఇది విశ్వక్ సేన్ కి అర్థమయ్యేలా చెప్పి ఉంటారు.
Actor Allu Arjun did not appear in person before the Nampally court on Monday in…
Sreeleela has become a trending topic on social media after a video from a Yoga…
Actor-turned-politician C. Joseph Vijay turned 52 today, marking his first birthday after being sworn in…
Nandamuri Balakrishna is currently busy shooting for his upcoming film, tentatively titled NBK111, under the…
Samantha is back in style. Her comeback film "Maa Inti Bangaaram" has emerged as a…
View this post on Instagram A post shared by Telugucinema.com (@telugucinemacom) Amritha Aiyer may not…