Advertisement
తెలుగు న్యూస్

బాల్య వివాహం చేసుకోను: విశ్వక్

కల్యాణమొచ్చినా, కక్కు వచ్చినా ఆగదనేది సామెత. ఈ సామెతను మరోసారి రిపీట్ చేస్తున్నాడు హీరో విశ్వక్ సేన్. తన పెళ్లికి సంబంధించి ఈ విధంగా రియాక్ట్ అయ్యాడు ఈ హీరో.

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అనుకునే హీరోలంతా వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా ఎంటరైన బ్యాచ్ లో విశ్వక్ సేన్ ముందు వరసలో ఉన్నాడు. ఈమధ్య ఎక్కువగా విశ్వక్ సేన్ కు ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

తాజాగా మరోసారి తన పెళ్లిపై స్పందించాడు విశ్వక్. తనకింకా 28 ఏళ్లు మాత్రమేనని, ఇంత తొందరగా పెళ్లి చేసుకుంటే బాల్య వివాహం అంటారంటూ జోక్ చేశాడు. అయినా పెళ్లి అనేది తన చేతిలో లేదని, జరగాల్సిన టైమ్ వచ్చినప్పుడు ఆటోమేటిగ్గా జరుగుతుందని ప్రకటించాడు.

హీరోగా, నిర్మాతగా తను బాగా సెటిల్ అయ్యానని అంటున్నాడు ఈ హీరో. సొంతిల్లు, మంచి కారు, కాస్ట్ లీ బట్టలు వేసుకుంటున్నానని.. నిర్మాతగా బాగానే క్లిక్ అయ్యానని చెబుతున్నాడు. కొత్త ఏడాదిలో తన తండ్రికి నిర్మాతగా రెస్ట్ ఇచ్చానని, తను మాత్రమే డబ్బులు పెట్టి సినిమాలు తీస్తానని అంటున్నాడు.

Advertisement

This post was last modified on December 31, 2023 1:20 pm

Advertisement
Share