Advertisement
తెలుగు న్యూస్

చరణ్, సాయి పల్లవి కాంబో కుదిరేనా?

రామ్ చరణ్ సరసన సాయి పల్లవిని కన్సిడర్ చేస్తున్నారు అని తెలుగుసినిమా.కామ్ దాదాపు నెలల క్రితమే రాసింది. “ఆచార్య” సినిమాలో మొదట సాయి పల్లవి పేరునే పరిశీలించారు. ఆ తర్వాత కియారా అద్వానీ వైపుకు మొగ్గు చూపారు. ఐతే, ఇప్పుడు కియారా డేట్స్ పొందడం కష్టంగా ఉందట. సో మరోసారి సాయి పల్లవి వైపు వచ్చారనేది టాక్.

మరి సాయి పల్లవి అంగికరీస్తుందా? ఆమె ఒక సినిమా ఒప్పుకోవాలంటే పాత్ర కచ్చితంగా ఆమెకి నచ్చాలి. హీరో, డైరెక్టర్ ల కన్నా రోల్ ముఖ్యం ఆమెకి. అలాగే, సాయి పల్లవి రామ్ చరణ్ జోడిగా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్కౌట్ అవుతుందా?

“ఆచార్య” షూటింగ్ ని అక్టోబర్ లో కానీ, నవంబర్ లో కానీ మొదలుపెట్టాలనుకుంటున్నారు డైరెక్టర్ శివ కొరటాల.

Advertisement

This post was last modified on September 10, 2020 9:23 am

Advertisement
Share