Advertisement
తెలుగు న్యూస్

‘టైగర్’తో ట్రాక్లోకి వస్తాడా?

రవితేజ ఎప్పుడూ వరుసగా హిట్స్ ఇచ్చిన చరిత్ర లేదు. ఒక హిట్ ఇస్తే రెండు ఫ్లాపులు ఇవ్వడం వేరు కామన్. ఇక వరుసగా రెండు హిట్స్ ఇస్తే మరో మూడు పోతాయి అని అంటారు. ఎందుకంటే అలాంటి ట్రాక్ రికార్డు ఉంది.

‘క్రాక్’ వంటి సూపర్ హిట్ తర్వాత వరుసగా రెండు ఫ్లాపులు ఇచ్చారు రవితేజ. ఆ రెండు ఫ్లాపుల తర్వాత ‘ధమాకా’ వచ్చి పెద్ద హిట్ అయింది. ఆ సినిమాతో పాటు గెస్ట్ గా నటించిన ‘వాల్తేర్ వీరయ్య’తో కూడా విజయం అందుకున్నారు రవితేజ. కానీ హ్యాట్రిక్ ని మాత్రం మరోసారి మిస్ అయ్యారు. ‘రావణాసుర’తో మరో ఘోరమైన పరాజయం అందుకున్నారు.

ఐతే, తదుపరి చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్లోకి వస్తారా? లేక గతంలోలా రెండు ఫ్లాపుల తర్వాతే మళ్ళీ విజయం అందుకుంటారా?

‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా రవితేజకి చాలా కీలకం. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది. మరి, ఈ సినిమాతో తన సత్తా చాటుతారా రవితేజ?

Advertisement

This post was last modified on April 17, 2023 11:19 pm

Advertisement
Share