Advertisement
తెలుగు న్యూస్

ఇంకోసారి అదే తప్పు!

‘అంధాదున్’ సినిమాలో టబు పోషించిన సిమి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమాలో టబు ప్రదర్శించిన విలనిజానికి ఫిదా కాకుండా ఎవరూ ఉండలేరు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఆ క్రైం థ్రిల్లర్ ఇప్పటికే తెలుగు, మలయాళ భాషల్లో రీమేక్ అయింది. ఇప్పుడు ‘అందగన్’ పేరుతో తమిళంలో తెరకెక్కుతోంది.

పాతికేళ్ల క్రితం రొమాంటిక్ హీరోగా పేరొందిన ప్రశాంత్ ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో టబు పాత్రని సిమ్రాన్ పోషించనుంది.

టబుగా మలయాళంలో మమతా మోహన్ దాస్, తెలుగులో తమన్నా మెప్పించలేకపోయారు. ఇద్దరూ మిస్ క్యాస్టింగ్ అనిపించుకున్నారు. తమిళ్ లో కూడా అదే జరుగుతోంది అని చెప్పాలి. ఎందుకంటే హీరో ప్రశాంత్ కి 48 ఏళ్ళు. అతనే అంకుల్ స్టేజిలో ఉన్నారు. అతనికి 46 ఏళ్ల సిమ్రాన్ ఎలా సూట్ అవుతుంది.

‘ముందుగా అంధాదున్’ సినిమా కథని అర్థం చేసుకోవాలి. ఒక 30 ఏళ్ల కుర్రాడు, ఒక 40/45 ఏళ్ల ఆంటీ మధ్య జరిగే ఘర్షణ ఈ సినిమాకి హైలైట్. ఆ పాత్ర పోషించే టైంలో హీరో ఆయుష్మాన్ కి 33 ఏళ్లు. టబుకి 45 ఏళ్ళు. వారి పాత్రలకు పక్కాగా సూట్ అయ్యారు.

కానీ, తమిళ్ రీమేక్ లో హీరో ప్రశాంత్ కిప్పుడు 48 ఏళ్ళు. దానికి తోడు అతని కన్నా రియల్ లైఫ్ లో రెండుళ్లు చిన్నదైన సిమ్రాన్ ఆ పాత్ర పోషించడం ఎంత అసంబంధమైన ఆలోచన. సిమ్రాన్ ఎంత గొప్పగా ఆ పాత్రని పోషించినా టబు ఎఫెక్ట్ తీసుకురావడం కష్టం.

Advertisement

This post was last modified on March 8, 2022 3:15 pm

Advertisement
Share