Advertisement
తెలుగు న్యూస్

ఒక్కో కార్మికుడికి 5 వేలు ఇస్తున్న యష్

కరోనా సంక్షోభంతో పని లేక అల్లాడుతోన్న సినిమా కార్మికులను ఆదుకునేందుకు కన్నడ సూపర్ స్టార్ యష్ ముందుకొచ్చాడు. తనవంతుగా కోటిన్నర రూపాయలను డొనేట్ చేశాడు. కన్నడ సినిమా పరిశ్రమలో పనిచేస్తున్న 3000 మంది కార్మికులకు డైరెక్ట్ గా వారి అకౌంట్ లలో 5 వేల రూపాయలు డిపాజిట్ చేస్తాడట.

“ఇది పెద్ద మొత్తం కాదు. వారి కష్టాలను పూర్తిగా తొలగించదు అని తెలుసు. కానీ నా వంతుగా ఎంతో కొంత వారికి ఉపయోగ పడేలా అందిస్తున్నా. మంచి కాలం ముందు ఉంది అనే ఆశతో ఉండాలని కోరుకుంటున్నా,” అని చెప్పాడు యష్.

కెజిఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పెద్ద హీరోగా మారిపోయాడు యష్. దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నాడు.

Advertisement

This post was last modified on June 1, 2021 10:56 pm

Advertisement
Share