తమిళ హీరో రవి మోహన్ విడాకుల కేసు కోర్టుకి చేరుకొంది. భార్య ఆర్తితో ఉండడం సాధ్యం కాదని రవి కోర్టుకు చెప్పాడు. విడాకులు కావాల్సిందే అని క్లారిటీ ఇచ్చాడు. మరోవైపు, ఆర్తి కూడా కోర్టుకు భరణం గురించి పిటీషన్ వేసింది అని మీడియా వార్తలు చెప్తున్నాయి.
ఐతే ఆమె అడుగుతున్న భరణం కొంచెం షాకింగ్ గా ఉంది.
రవి మోహన్ తనకు నెలకు 40 లక్షలు ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేస్తోంది. తన భర్త ఆదాయం, తాను నష్టపోయినవి అన్నీ కాలిక్యులేట్ చేసి ఈ మొత్తం అడుగుతున్నట్లు ఆమె పేర్కొంది. సంవత్సరానికి 3 కోట్లపైనే భరణం ఇవ్వాలి అని అడగడం టూమచ్ అక్కా అంటూ ఆమె అభిమానులు సైతం ట్విట్టర్లో సెటైర్లు వేస్తున్నారు.
హీరోగా కోట్లు సంపాదిస్తున్న రవికి అది పెద్ద మొత్తం కాదు అని ఆమె వాదన. అంతే కాదు, తన కుమారులు కూడా తన వద్దే ఉంటారు. కాబట్టి అంత మొత్తం కావాలని ఆమె చెప్తోంది. కేసు వచ్చే నెలకి వాయిదా పడింది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…