ఎవరైనా నవ్వితే అందంగా ఉంటారు. కానీ అనన్య పాండే మాత్రం ఏడిస్తే అందంగా ఉంటుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. ఓ పాడ్ కాస్ట్‌లో మాట్లాడుతూ తనకు ఏడుపు అంటే ఇష్టమని చెప్పుకొచ్చింది.
తను ఏడుస్తున్నప్పుడు కచ్చితంగా కొన్ని సెల్ఫీలు తీసుకుంటానని ఆమె వెల్లడించింది. అలా తీసిన ఫొటోల్ని ఇనస్టాగ్రామ్ లో పెడతానని కూడా అంటోంది. ఎందుకంటే కన్నీటితో నిండిన ఆమె కళ్ళు సహజమైన నిగారింపును, అందాన్ని ఇస్తాయట.
తను ఏడ్చినప్పుడు ఎన్నోసార్లు అద్దంలో చూసుకున్నానని. తనకు బాగా నచ్చిందని, అప్పట్నుంచి ఆ తరహా ఫొటోల్ని అందరికీ షేర్ చేస్తున్నానని అంటోంది. భావోద్వేగాలను నియంత్రించడం తనకు చేతకాదంటోంది అనన్య పాండే. అందుకే ఏడ్చేస్తానని, ఆ టైమ్ లో తను అందంగా కూడా కనిపిస్తానని చెబుతోంది.
ఆమె నటించిన కంట్రోల్ (CTRL) అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైంది. ఆ సినిమా ప్రచారంలో భాగంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది అనన్య పాండే. ఈ సినిమాకు విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించాడు. ప్రియుడి చేతిలో మోసపోయిన వ్యక్తిగా అనన్య కనిపిస్తుంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…