తన వ్యక్తిగత ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతుంటుంది అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) చేసే షోలు, సినిమాల అప్ డేట్స్ కంటే, ఈ పర్సనల్ ఫొటోలతోనే ఎక్కువగా ఆమె పాపులర్ అయింది. మరీ ముఖ్యంగా బీచ్ లో బికినీ పొటోలు పెట్టిందంటే లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి.
ఎప్పట్లానే ఈసారి కూడా ఆమె తన వెకేషన్ ఫొటోలు పెట్టింది. ఇద్దరు పిల్లలతో దిగిన ఫొటోలు, లొకేషన్లు, తన బ్యూటీ టిప్స్ అన్నీ పెట్టింది. అయితే ఈసారి ఆమె పెట్టిన ఫొటోలన్నింటిలోకెల్లా ఒక్కటి మాత్రం జనాన్ని బాగా ఎట్రాక్ట్ చేసింది. అదే రజనీకాంత్ ఫొటో.
అవును.. రజనీకాంత్ (Rajinikanth)తో ఫొటో దిగింది అనసూయ. రజనీ పక్కన తన ఇద్దరు పిల్లల్ని నిలబెట్టి, తను పక్కన నిల్చొని పొటో దిగింది. నిమిషాల్లో ఈ స్టిల్ వైరల్ అవ్వడమే కాదు, అనసూయపై కొత్త పుకారుకు ఆజ్యం పోసింది.
రజనీకాంత్ కొత్త సినిమాలో అనసూయ నటిస్తోందంటూ కొత్త ప్రచారం ఊపందుకుంది. ఆమె దిగిన ఫొటో కూడా మేకప్ రూమ్ లోది. కాబట్టి కచ్చితంగా సినిమా షూటింగ్ లోనే ఆమె సూపర్ స్టార్ తో ఫొటో దిగిందని చాలామంది ఊహించుకుంటున్నారు.
మరికొందరు మాత్రం రజనీకాంత్ ను అనసూయ, అనుకోకుండా కలిసి ఉంటుందని, ట్రావెలింగ్ లో ఆయనతో ఫొటో దిగి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. అనసూయ మాత్రం ఈ ఫొటోపై క్లారిటీ ఇవ్వలేదు.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పుకారు వైరల్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఇది కూడా అలాంటిదే. అల్లు అర్జున్ (Allu…
'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వరప్రసాద్ గారు', 'భగవంత్ కేసరి'... ఈ మధ్య అనిల్ రావిపూడి (Anil Ravipudi) పెడుతున్న…
సినిమా హీరోలు భార్యలకు విడాకులు ఇవ్వడం చాలా కామనే. అలాగే రెండు పెళ్లిళ్లు చేసుకున్న హీరోలు చాలామందే ఉన్నారు భారతీయ…
‘'బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోనికి (Vijay Antony) తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. భిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ…
దేశమంతా ఎండలు మండుతున్నాయి. చెన్నైలో ఇంకా ఎక్కువగా ఉక్కపోత ఉంది. దాంతో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చెన్నై వాతావరణంలో…
తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar)కి తెలుగులో సడెన్ గా క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా…