అనుపమ పరమేశ్వరన్ వయస్సు 29. కానీ ఆమె పాతికేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే కాబోలు తన కన్నా చిన్న వయసు హీరోలతో ఆమె జతకడుతోంది.
ఇప్పటికే తెలుగులో ఆశిష్ సరసన “రౌడీ బాయ్స్”లో నటించింది. అతను ఆమె కన్నా మూడేళ్లు చిన్నవాడు. ఇక ఇప్పుడు తమిళ హీరో విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ సరసన ఒక చిత్రం ఒప్పుకొంది. ఈ సినిమా ఇటీవల ప్రారంభం అయింది. ధృవ్ విక్రమ్ కి 27 ఏళ్ళు. అంటే హీరో కన్నా అనుపమ రెండేళ్లు పెద్దది.
ఈ రోజుల్లో హీరో వయసు ఎంత, హీరోయిన్ వయసు ఎంత అని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. దర్శక, నిర్మాతలు కూడా పెద్దగా ఆలోచించడం లేదు. విజయ్ దేవరకొండ – సమంత జోడి కూడా అంతేగా. “ఖుషి” సినిమాలో వీరు జంటగా నటించారు. సమంత మూడేళ్లు పెద్దది.
అనుపమ కూడా కథ, పాత్ర నచ్చితే హీరో ఏజ్ తో సంబంధం లేకుండా జత కడుతోంది. అనుపమ పరమేశ్వరన్ ఇటు కుర్ర హీరోలతోనే కాకుండా మిడిల్ ఏజ్ హీరోలతోనూ నటిస్తోంది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా సైన్ చేస్తోంది.
ఇప్పుడు గ్లామర్ షోలోనూ రెచ్చిపోతోంది. మొత్తమ్మీద ఈ భామ బిజీ బిజీగా ఉంది అనేది వాస్తవం.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…