అవీ ఇవీ

Ashu Reddy: ప్రెస్ మీట్ పెడుతుందట!

ఆషు రెడ్డి (Ashu Reddy) పేరు ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర (Dharmenda)ను పెళ్లి పేరుతో మోసం చేసినట్లు ఆమెపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఈ కేసులో ఆషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై నాన్-బెయిలబుల్ కేసు నమోదైనట్లు మీడియా సమాచారం.

మరోవైపు, ఆషురెడ్డి తండ్రి కూడా ధర్మేంద్ర చేసిన ఆరోపణలు నిజమే అని ప్రకటించారు. తల్లి ఆశుని తప్పుదోవ పట్టిస్తోందని ఆయన అంటున్నారు. అందుకే, తాను తన భార్య, కూతురు ఆశు నుంచి విడిగా ఉంటున్నట్లు తెలిపారు.

ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆషు అతని నుండి భారీగా డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఐదు కేజీల బంగారం కొనిపించుకున్నదే కాకుండా, తన నివాసం కోసం విలాసవంతమైన విల్లా కోసం కూడా అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం.

ఇక వీరిద్దరూ కలిసి వేణుస్వామితో జాతకాలు చెప్పించుకుని, ప్రత్యేక పూజలు చేయించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధర్మేంద్రతో పెళ్లి ఖరారు అయిన తర్వాత, ఆమె అడిగిన ప్రతి అవసరానికి అతను డబ్బులు పంపినట్లు తెలుస్తోంది. ఈ లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్ వివరాలను ధర్మేంద్ర కుటుంబ సభ్యులు బయటపెట్టారు.

ఆషు రెడ్డి అకస్మాత్తుగా పెళ్లిని రద్దు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ వివాదంపై ఆమె త్వరలోనే ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొంతమంది పెద్దలతో ఆమె మంతనాలు జరుపుతోంది ఈ కేసులో ఎలా ముందుకు పోవాలనే విషయంలో.

ఈ భామకి ఇన్ స్టాగ్రామ్ లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలు ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…

3 hours ago

Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…

3 hours ago

Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…

3 hours ago

హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram

'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…

18 hours ago

Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…

23 hours ago

Sakkshi Mhadolkar: శ్రీ విష్ణు సరసన ‘మౌగ్లీ’ ముద్దుగుమ్మ

సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…

1 day ago