ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “కల్కి 2898 AD” సీక్వెల్‌కి సంబంధించిన పనులు సైలెంట్‌గా కొనసాగుతున్నాయి. ‘కల్కి 2’ (Kalki 2)షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభాస్ ఇంకా షూటింగ్‌లో పాల్గొనలేదు. కానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తమ పాత్రలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను పూర్తి చేశారు.
ఇక ఈ సీక్వెల్‌లో కీలక మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొదటి భాగంలో నటించిన దీపిక పదుకొణే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొంది. ఆమె మొదటి భాగంలో సుమతి అనే పాత్రలో నటించింది. ఆమె స్థానంలో సాయి పల్లవి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో క్లైమాక్స్‌లో వచ్చే ఒక స్పెషల్ రోల్ కోసం తమిళ హీరో శింబు (Simbu) పేరు వినిపిస్తోంది. ఈ పాత్ర సినిమాకి కీలకమైందిగా ఉంటుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ప్రస్తుతం కొత్త షెడ్యూల్ కోసం భారీ సెట్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2028లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…