నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా రంగంలో అగ్ర హీరోల్లో ఒకరు. దాదాపు 40 ఏళ్లుగా నటిస్తున్నారు. 100కి పైగా సినిమాలు చేశారు. వారసత్వంగా కూడా బోలేడంతా ఆస్తి వచ్చింది. అయినా తన ఆస్తి పేరు మీద వంద కోట్లు కూడా లేదంట. బాలయ్య ఎన్నికల కమీషన్ కి తాజాగా తన ఆస్తుల, అప్పుల చిట్టా చూపించారు.
బాలయ్య పేరు మీద ఆస్తి తక్కువే ఉన్నా ఆయన భార్య, ఆయన కొడుకు మోక్షజ్ఞ పేరుపై భారీగానే ఆస్తులు ఉన్నాయి.
ఆయన మూడోసారి ఎమ్మెల్యేగా హిందూపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. దాంతో ఎన్నికల సంఘానికి తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు.
ఆస్తులు
బాలకృష్ణ ఆస్తులు: రూ.81 కోట్లు
భార్య వసుంధర పేరుమీదున్న ఆస్తులు: రూ.140 కోట్లు
కొడుకు మోక్షజ్ఞ పేరుమీదున్న ఆస్తులు: రూ. 58.63 కోట్లు
ముగ్గురి పేరున్న ఆస్తుల విలువ : రూ. 279 కోట్లు
అప్పులు
బాలయ్యకి రూ. 9 కోట్ల అప్పులు
భార్యకి రూ. 3 కోట్ల అప్పులు
ప్రస్తుతం బాలయ్య సినిమాకి 25 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ఆయన బాబీ డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకి అక్షరాలా పాతిక కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత బోయపాటి డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నారు. దానికి ఇంకా పారితోషికం పెంచే అవకాశం ఉంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…