సమంత ఆ సినిమాలో నటించబోతోంది, ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ గత కొన్నాళ్లుగా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇప్పటివరకు ఆమె కొత్త సినిమాకి సంబంధించి ప్రకటన రాలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక బడా తమిళ చిత్రం దక్కింది అనే న్యూస్ బయటికి వచ్చింది.
తమిళనాట అగ్ర హీరో విజయ్ త్వరలో ఒక కొత్త సినిమా మొదలుపెడుతున్నారు. ఎచ్. వినోద్ దీనికి దర్శకుడు. మొదట సముద్రఖని డైరెక్షన్లో సినిమా అనుకున్నారు విజయ్. కానీ అది వర్కువట్ కాలేదు. దాంతో వినోద్ చెప్పిన పొలిటికల్ స్టోరీకి ఓకే చెప్పారు విజయ్. ఈ సినిమాకి నిర్మాత మన తెలుగు నిర్మాత దానయ్య కావడం విశేషం.
ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిష పేరు వినిపించింది. ఐతే, ప్రస్తుతం త్రిషని, విజయ్ ని లింక్ చేస్తూ తమిళనాట రూమర్లు పెరగడంతో ఆ ఆలోచనని విరమించుకున్నారట. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ బరిలో నిలవనున్నారు. ఇప్పటికే తన పార్టీని ప్రకటించారు విజయ్. సో, ఇకపై ఆయన్ని రాజకీయంగా టార్గెట్ చేస్తూ తమిళనాడు పార్టీలు మరింతగా విమర్శలు చేస్తాయి. పుకార్లు లేపుతాయి. అందుకే త్రిషని తీసుకోవద్దని సన్నిహితులు చెప్పారట.
ఇటీవలే “లియో” సినిమాలో త్రిష, విజయ్ భార్యాభర్తలుగా నటించారు. తాజా చిత్రంలో మీనాక్షి చౌదరి విజయ్ హీరోయిన్ గా నటిస్తోంది. మళ్ళీ ఈ కొత్త సినిమాలో త్రిషని తీసుకుంటే మరింతగా పుకార్లు లేపుతారు అని విజయ్ మిత్రులు చెప్పారట. దాంతో దర్శకుడు ని వేరే పేర్లు పరిశీలించాల్సిందిగా విజయ్ చెప్పాడట.
పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలనే…!
అలా త్రిష బదులు సమంత పేరు లైన్లోకి వచ్చింది. ఐతే సమంతకి ఈ సినిమా దక్కుతుందా అనేది చూడాలి.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…