ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారు. సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. అయితే ప్రాజెక్టుపై ఓ గాసిప్ మాత్రం అలానే ఉండిపోయింది.
గతంలో నానికి చెప్పిన ఓ కథతోనే, ఇప్పుడు ప్రభాస్ హీరోగా సినిమా తెరకెక్కిస్తున్నాడని హనుపై ఓ రూమర్ ప్రచారంలో ఉంది. ఎట్టకేలకు దీనిపై స్పందించాడు దర్శకుడు.
“ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా దగ్గర 6 కథలున్నాయి. ప్రభాస్ కోసం కొత్త కథ రాశాను. కేవలం ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకొని రాసిన కథ ఇది. నా దగ్గర ఆల్రెడీ ఉన్న 6 కథలకు దీనితో సంబంధం లేదు. అలా ఫ్రెష్ గా రాయడం వల్లనే టైమ్ పట్టింది. దాదాపు ఏడాదికి పైగా కథపై కూర్చున్నాను.”
గతంలో నానికి చెప్పిన కథ ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీనే అయినప్పటికీ.. ప్రభాస్ తో చేస్తున్న సినిమాకు నానికి చెప్పిన కథకు సంబంధం లేదంటున్నాడు హను. సినిమా రిలీజైన తర్వాత ఇది కేవలం ప్రభాస్ కోసం తీసిన సినిమా అనే విషయాన్ని అంతా గుర్తిస్తారని అంటున్నాడు.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…