ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా మాట్లాడే నటి కస్తూరి (Kasthuri), మరోసారి తన శైలికి తగ్గట్టు స్పందించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. డీఎంకే పార్టీని ఆమె బాహాటంగా దుమ్మెత్తిపోయడం వివాదాస్పదమైంది.
తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారాన్ని కోల్పోయింది. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఘన విజయం సాధించింది. ఈ అంశాన్ని లేవనెత్తిన కస్తూరి, ద్రవిడ మోడల్ పాలనను ప్రజలు తరిమికొట్టారంటూ ఓపెన్ గానే ప్రకటించింది.
దశాబ్దాలుగా సాగుతున్న పాత రాజకీయాలకు కాలం చెల్లిందని, ద్రవిడ మార్కు పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆమె అన్నారు.
“ద్రవిడ మోడల్” అనే నినాదాన్ని బలంగా ఎత్తుకుంది డీఎంకే పార్టీ. తమిళనాడు లోకల్ ఫీలింగ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంది. దీని కోసం దాదాపు రెండేళ్లుగా “ద్రవిడ మోడల్” పాలనను ప్రజల్లోకి ఎక్కించే పని చేసింది. కానీ విజయ్ రాకతో ఇది సైడ్ అయిపోయింది.
ఇదే విషయాన్ని కస్తూరి ఎత్తిచూపింది. తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆదరణ పెరిగిందని అంటోంది కస్తూరి. కరుణానిధి కంటే స్టాలిన్ మరింత ప్రమాదం అంటూ ఆమె పెట్టిన పోస్టు వివాదాస్పదమౌతోంది.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…