డబుల్ ఇస్మార్ట్ నుంచి మరో సాంగ్ వచ్చింది. సినిమా నుంచి ఇది రెండో పాట. మొదటి సాంగ్ టైపులోనే ఇది కూడా పూరి జగన్నాధ్, మణిశర్మ స్టయిల్ లోనే సాగింది. అయితే ఓ చిన్న కొత్తదనం మాత్రం యాడ్ అయింది.
మార్ ముంత ఛోడ్ చింత అనే లిరిక్స్ తో సాగే ఈ పార్టీ సాంగ్ లో మధ్యమధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ వాయిస్ కూడా వినిపించింది. ‘ఏం జేద్దామంటావ్ మరి’ అనేది కేసీఆర్ ఫేమస్ డైలాగ్. ఆ వాక్యాన్ని ఈ పాటలో అక్కడక్కడ వాడారు. ఈ పంచ్ లైన్ పాటకు కిక్కు తీసుకొచ్చింది.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను రాహుల్ సింప్లిగంజ్ పాడాడు. పాట ఫుల్ ఎనర్జీతో ఉంది. హీరో రామ్ అంతే ఎనర్జీతో డాన్స్ చేయగా.. హీరోయిన్ కావ్య థాపర్ తన అందాలతో పాటను మరింత కలర్ ఫుల్ గా మార్చేసింది.
ఆగస్ట్ 15న థియేటర్లలోకి వస్తోంది డబుల్ ఇస్మార్ట్.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…