ఎదుటి వ్యక్తిని గౌరవించడంలో పరిశ్రమలో చిరంజీవి తర్వాతే ఎవరైనా. చిన్న నటుడిపైనా, జర్నలిస్ట్ అయినా, మరో రంగానికి చెందిన వ్యక్తి అయినా అందరికీ సమప్రాధాన్యం ఇస్తారు చిరంజీవి. వాళ్లకు తగిన గౌరవం ఇస్తారు. అదే ఆయన్ను అందరివాడిని చేసింది.
నటి మధుబాల స్టేట్ మెంట్ తో ఈ విషయం మరోసారి తెరపైకొచ్చింది. చిరంజీవి తనకు అపారమైన గౌరవం ఇవ్వడం చూసి తను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చింది.
కెరీర్ ప్రారంభించిన కొత్తలో ఓసారి చిరంజీవిని కలిసిందంట మధుబాల. అప్పటికే ఆయన మెగాస్టార్. అయినప్పటికీ తనను చూసి కుర్చీలోంచి లేచి విష్ చేశారని, అప్పుడు తను ఆశ్చర్యపోయానని అన్నారు.
లాంగ్ బ్యాక్ తర్వాత రీసెంట్ గా మరోసారి చిరంజీవిని కలిసి అవకాశం దక్కిందని, ఈసారి కూడా ఆయన అదే విధంగా కుర్చీలోంచి లేచి తనకు రెస్పెక్ట్ ఇచ్చారని, తను కూర్చున్న తర్వాతే ఆయన కూర్చున్నారని మధుబాల గుర్తుచేసుకుంది.
అప్పటికీ ఇప్పటికీ చిరంజీవి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని గుర్తుచేసుకుంది మధుబాల. చిరంజీవి అంటేనే గౌరవానికి ఓ ప్రతీక అని అంటోంది.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…