శైలేష్ కొలను.. కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు. అదే ‘సైంధవ’ సినిమా. వెంకటేశ్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ ఇది. కానీ ఫలితం లేకుండా పోయింది. తన 75వ సినిమా అని వెంకీ చెప్పుకునే పరిస్థితి లేదక్కడ.
అయితే శైలేష్ కు ఈ ఫ్లాప్ తో సంబంధం లేదంటున్నాడు హీరో నాని. అతడి రేంజ్ వేరే అంటూ కితాబిస్తున్నాడు. శైలేష్ తో ‘హిట్-3’ తీసిన నాని, దర్శకుడికి కాస్త తొందర ఎక్కువని, ఆ తొందరలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడని తెలిపాడు.
అయితే ఈమధ్య శైలేష్ లో చాలా మార్పు వచ్చిందని, ఏ పనైనా చాలా పద్ధతిగా చేస్తున్నాడని అన్నాడు. ఏ దర్శకుడిలో లేని ప్రత్యేకమైన లక్షణం శైలేష్ లో ఉందంటున్నాడు నాని. ఎలాంటి పనినైనా సాధించి చూపిస్తాడట.
‘హిట్-3’ లాంటి సినిమా తీయడం చాలా కష్టమని, శైలేశ్ ఉన్నాడు కాబట్టి ఈ కథలో నటించడానికి తను ఒప్పుకున్నానని అన్నాడు నాని. సినిమా చూసిన తర్వాత తన స్టేట్ మెంట్ నిజమని అంతా ఒప్పుకుంటారని ధీమాగా చెబుతున్నాడు.
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో 'యానిమల్',…
దర్శకుడు మారుతి (Maruthi) ఆ మధ్య తీసిన 'ది రాజా సాబ్' (The Raja Saab) సినిమా ఎంత ఘోరంగా…