నభా నటేశ్ (Nabha Natesh)కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. అలా హిట్టిచ్చాడు కాబట్టి అతడంటే ఇష్టం కాదంటోంది నభా నటేశ్. పూరి జగన్నాధ్ వ్యక్తిత్వం, ఆయన ఫిలాసఫీ అంటే తనకు పిచ్చి అని చెబుతోంది. నిజజీవితంలో పూరి జగన్నాధ్ ను నూటికి నూరు శాతం ఫాలో అవుతుందంట నభా.
నిజజీవితంలో ప్రాక్టికల్ గా బతికడమంటే ఏంటో పూరి జగన్నాధ్ ను చూసి నేర్చుకున్నానంటోంది నభా నటేష్.
“చాలామంది గతం గురించి తలుచుకొని బాధపడతారు. కొంతమంది భవిష్యత్ పై ఆందోళనగా ఉంటారు. కానీ పూరి జగన్నాధ్ మాత్రం ఈ క్షణం మాత్రమే నీదని చెబుతుంటారు. ఆయన అలానే బతుకుతాడు. అదే నేను కూడా అలవాటు చేసుకున్నాను.”
గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేమని, ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకుంటే, ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా గడపొచ్చని చెబుతోంది నభా నటేశ్.
పూరి జగన్నాధ్ పాడ్ కాస్ట్ అన్నా కూడా ఈమెకు చాలా ఇష్టమంట. ఆయన నుంచి ఒక పాడ్ కాస్ట్ ఇలా వచ్చిందంటే చాలు వెంటనే దాన్ని చూస్తుందంట. వీలైతే నిజజీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తుందంట. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు పూరి జగన్నాధ్ నే ఎక్కువగా కలవడానికి తాను ఇష్టపడతానంటోంది నభా నటేశ్.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…