Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట

TeluguCinema, June 18, 2026June 18, 2026
Nabha Natesh

నభా నటేశ్ (Nabha Natesh)కు తొలి కమర్షియల్ హిట్ ఇచ్చిన దర్శకుడు పూరి జగన్నాధ్. అలా హిట్టిచ్చాడు కాబట్టి అతడంటే ఇష్టం కాదంటోంది నభా నటేశ్. పూరి జగన్నాధ్ వ్యక్తిత్వం, ఆయన ఫిలాసఫీ అంటే తనకు పిచ్చి అని చెబుతోంది. నిజజీవితంలో పూరి జగన్నాధ్ ను నూటికి నూరు శాతం ఫాలో అవుతుందంట నభా.

నిజజీవితంలో ప్రాక్టికల్ గా బతికడమంటే ఏంటో పూరి జగన్నాధ్ ను చూసి నేర్చుకున్నానంటోంది నభా నటేష్.

“చాలామంది గతం గురించి తలుచుకొని బాధపడతారు. కొంతమంది భవిష్యత్ పై ఆందోళనగా ఉంటారు. కానీ  పూరి జగన్నాధ్ మాత్రం ఈ క్షణం మాత్రమే నీదని చెబుతుంటారు. ఆయన అలానే బతుకుతాడు. అదే నేను కూడా అలవాటు చేసుకున్నాను.”

గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా వెనక్కు తీసుకురాలేమని, ఈ విషయాన్ని మైండ్ లో పెట్టుకుంటే, ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా గడపొచ్చని చెబుతోంది నభా నటేశ్.

పూరి జగన్నాధ్ పాడ్ కాస్ట్ అన్నా కూడా ఈమెకు చాలా ఇష్టమంట. ఆయన నుంచి ఒక పాడ్ కాస్ట్ ఇలా వచ్చిందంటే చాలు వెంటనే దాన్ని చూస్తుందంట. వీలైతే నిజజీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తుందంట. హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు పూరి జగన్నాధ్ నే ఎక్కువగా కలవడానికి తాను ఇష్టపడతానంటోంది నభా నటేశ్.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Ananya Nagalla
    Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Rashmika Mandanna
    Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Trivikram and Venkatesh
    Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan
    Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
  • Nabha Natesh
    Nabha Natesh: పూరిని వంద శాతం ఫాలో అవుతుందంట
  • Mahesh Babu
    Mahesh Babu: పెద్ది దర్శకుడితో సినిమా ఉండదు!
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఏ అవకాశాన్నీ వదులుకోవట్లేదుగా!
  • Samantha
    చాలా జీవితాన్ని చూశానంటున్న Samantha
  • Ustaad Bhagat Singh, The Raja Saab and Peddi
    North America: ‘పెద్ద'(ద్ది) చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు షాకులే
  • తమిళ దర్శకులను తెగ పొగిడిన Malavika Mohanan
  • Chiranjeevi: మొదట దేవి కథ మెగా ఖాతాలోనే
  • Nayanthara
    Nayanthara: ‘కాంచన 4’లో లేడి సూపర్ స్టార్ నటిస్తుందా!
  • Pooja Hegde: క్రేజ్ వేరు, సక్సెస్ వేరు
  • Aishwarya Rajesh
    Aishwarya Rajesh: స్టయిలింగ్ పై పడిన ఫోకస్!
  • Allu Arjun: విలువైన సెలబ్రిటీల లిస్ట్ లో ఒక్కడు

Recent News

  • Ananya Nagalla: ఫొటోషూట్స్ లో అందాల రచ్చ
  • Ritika Nayak: హిట్ హీరోయిన్ ను వదిలేశారేంటి?
  • Rashmika Mandanna: సమాజం కోసం పెళ్లి చేసుకోవద్దు
  • Aadarsha Kutumbam: 2027కి వాయిదా పడే ఛాన్స్ లేదంట!
  • Ram Charan: ఇక మరో మేకోవర్ కి సిద్ధం కావాలి
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes