
మంచు విష్ణు (Manchu Vishnu) కెరీర్లో అతిపెద్ద చిత్రం… కన్నప్ప (Kannappa). భారీ వ్యయంతో తీసిన ఈ చిత్రం అతనికి మంచి పేరు తెచ్చింది. భారీ ఓపెనింగ్స్ కూడా తీసుకొచ్చింది.
ఈ సినిమా గతేడాది విడుదలైంది. ఇప్పుడు మరోసారి థియేటర్లోకి వస్తోంది.
రిలీజ్ అయి ఏడాది అవుతున్న సందర్భంగా మళ్లీ జూన్ 27న ‘కన్నప్ప’ చిత్రాన్ని కొన్ని థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ మేరకు విడుదల చేసిన రీ రిలీజ్ డేట్ పోస్టర్ వైరల్ అవుతోంది.
అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం వంటి పేరొందిన స్టార్స్ కూడా నటించారు.
