Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

OG 2: పవన్ కళ్యాణ్ కే ఇంకా సందేహం ఉందా?

TeluguCinema, June 18, 2026June 18, 2026
Pawan Kalyan

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఐతే బీజేపీ – టీడీపీ స్కెచ్ లో భాగంగా త్వరలో జరగబోయే హైదరాబాద్, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు పవన్ కల్యాణ్. జనసేనని పోటీలో దింపి, బీజేపీకి అనుకూల వాతావరణం కల్పించే పని పెట్టుకున్నారు పవన్ అని టాక్. అందుకే, మొన్నామధ్య హైదరాబాద్ లో ప్రెస్ మీట్ తెలంగాణ మీ జాగీరా అంటూ రెచ్చిపోయారు. ఇప్పుడు వరంగల్ లో హడావిడి చేశారు.

పనిలో పనిగా “OG 2” గురించి మాట్లాడారు.

పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దీనికి త్వరలోనే సీక్వెల్ రాబోతోందనే విషయాన్ని కూడా రీసెంట్ గా అధికారికంగా ప్రకటించారు. ఐతే, తాజాగా హన్మకొండలో అనారోగ్యంతో ఉన్న తన అభిమాని నిరంజన్‌ను పవన్ కల్యాణ్ స్వయంగా వెళ్లి పరామర్శించారు. ఆ సమయంలో నిరంజన్ ఎంతో ఆత్రుతగా ”OG 2″ అప్‌డేట్ గురించి పవన్‌ను అడగడంతో, పవన్ అభిమానికి ఒక మాట ఇచ్చారు.

ఒకవేళ తాను ‘ఓజీ-2’ సినిమా తీస్తే దానికి స్పెషల్ గెస్ట్‌గా నిన్నే ప్రత్యేకంగా ఆహ్వానిస్తానని ప్రామిస్ చేశారు.

అంటే నిజంగా “OG 2” మొదలవుతుందా అనే విషయంలో పవన్ కళ్యాణ్ కి సందేహంగా ఉందా?

#PawanKalyan once again expressed his keen interest in #OG2 & how much he enjoyed #OG as he wants to experience with Niranjan, who is battling a rare disease

He also promised to invite him as a special guest for #TheyCallHimOG sequel#Sujeeth – it's timepic.twitter.com/E4biG7iFoN

— telugucinema.com (@thetelugucinema) June 17, 2026

తెలంగాణలో ఎన్నికల కోసం ఇంకా పవన్ నుంచి ఎంతో హడావిడి చూడాల్సి ఉంటుంది. ఓజీ సీక్వెల్ సంగతి ఏమో కానీ రాజకీయ సినిమా మాత్రం మనం చూడబోతున్నాం.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Preity Mukhundhan
    Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh
    Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • Nani
    The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
  • Sai Pallavi
    తెలిసి కూడా ముద్దు అడుగుతుంటారు: Sai Pallavi
  • Nidhhi Agerwal
    Nidhhi Agerwal: డబ్బున్న మగాడు కోసం వెదుకుతున్నాను!
  • Kiara Advani and Yash in Toxic
    Toxic: ఆ పుకార్లు నిజం కాదని ప్రూవ్ చేసింది కియరా
  • Krithi Shetty
    Krithi Shetty: నన్ను గ్లామర్ కి వాడుకొండి అని చెప్తోందా!
  • Nagabandham, Akhanda 2 and Hari Hara Veera Mallu,
    Sanathana ట్రెండ్ తెలుగు సినిమాలకు కలిసి రావడం లేదా?
  • Kajal Aggarwal
    Kajal Aggarwal: ఇన్ స్టాలో అందాల ఆరబోత, సినిమాల్లో నో గ్లామర్!
  • Aishwarya Rajesh
    ఆ మేజిక్ కోసం చూస్తానంటున్న Aishwarya Rajesh
  • Sreeleela
    అలాంటి వాడు దొరికితే రెడీ అంటోన్న Sreeleela
  • Shriya
    Shriya: హీరోయిన్ పై కామెంట్ చేస్తే థ్యాంక్స్ చెప్పిన భర్త
  • Bhagyashri Borse
    Bhagyashri Borse: తొలి సినిమా నుంచి ఆ కథలే భాగ్యం
  • Malavika Mohanan
    మాల్దీవుల్లో Malavika Mohanan అందాల ఆరబోత
  • Neha Dhupia
    Neha Dhupia: ‘వెనకనుంచి తీయొద్దురా బాబు’, పాపరాజీపై మండిపాటు

Recent News

  • Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో
  • Kiran Abbavaram: ఇక ‘చెన్నై లవ్ స్టోరీ’తో పరీక్ష స్టార్ట్
  • Preity Mukhundhan: ఈ ఆరు ‘ప్రీతి’పాత్రమైనవి
  • Venkatesh: రెండు హిట్లతో పారితోషికం భారీగా పెంపు
  • The Paradise: నాని తెగ వర్రీ అవుతున్నారట
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes