“సరిపోదా శనివారం” సినిమాలో ప్రియాంక మోహన్ ను హీరోయిన్ గా తీసుకున్న వెంటనే అందరూ ఒక దానికి ఫిక్స్ అయిపోయారు. గతంలో ఈమెతో “గ్యాంగ్ లీడర్” అనే సినిమా చేశాడు నాని. అది ఫ్లాప్ అయింది. దీంతో ఆమెకు మరో అవకాశం ఇస్తానని నాని ప్రామిస్ చేసి ఉంటాడని అంతా అనుకున్నారు.
కానీ నాని వెర్షన్ మరో విధంగా ఉంది. తను ఎప్పుడూ ప్రియాంకకు అలాంటి ప్రామిస్ చేయలేదని చెప్పాడు. ఒకే ఒక్క కారణంతో మళ్లీ ఆమెను తీసుకున్నామని వెల్లడించాడు.
“గ్యాంగ్ లీడర్” సినిమాలో నాని-ప్రియాంక మధ్య సన్నివేశాలు చాలా తక్కువ. అలా ఉన్న 3-4 సీన్లు కూడా చాలా పెద్ద పాపులర్ అయ్యాయి అని అంటున్నాడు నాని. ఇప్పటికీ తమిళ్, మలయాళంలో ప్రేక్షకులు తను ప్రియాంకతో చేసిన సన్నివేశాల్ని ట్యాగ్ చేస్తుంటారని అన్నాడు.
ఒక సినిమాలో 3-4 సీన్స్ కే అంత రెస్పాన్స్ వచ్చినప్పుడు, సినిమా మొత్తం ఆమెతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతోనే, మరోసారి ప్రియాంకను తీసుకున్నట్టు వెల్లడించాడు నాని.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కింది “సరిపోదా శనివారం” సినిమా.
శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. షోలు చేస్తోంది. తాజాగా సమంత హీరోయిన్…
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) అంటే అందరికీ ట్రోలింగ్ మెటీరియల్ అని చెప్పాలి. అయ్యగారు అంటూ ట్రోల్ చేస్తూ ఉంటారు…
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇంకా ఇంకా బాగా సంపాదించాలి అనే కసితో ఉంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ…
39 ఏళ్లకే చాలా జీవితాన్ని చూశానంటోంది సమంత (Samantha). తను అనుభవించిన కష్టాలు, నష్టాలన్నీ ప్రజలకు తెరిచిన పుస్తకం లాంటివని,…
ఇటీవల ధురంధర్ 2 (Dhurandhar 2) హిందీ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఆ సినిమా అమెరికా (North…
"2023లో నేను సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. కానీ జీవితం అనుకోని మలుపులు తిప్పింది. అలా సింగీతం శ్రీనివాసరావు…