రియల్ లైఫ్ లో నవదీప్ ఎఫైర్లు, ప్రేమలపై చాలా ఊహాగానాలు చలామణిలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని, పలు సందర్భాల్లో నవదీప్ అంగీకరించాడు కూడా. కొన్నింటిని ప్రత్యక్షంగా ఖండిస్తే, మరికొన్నింటిని పరోక్షంగా నిర్ధారించాడు. ఇలా నవదీప్ జీవితంలో చాలా లవ్ స్టోరీలున్నాయి.
ఇన్నిసార్లు ప్రేమలో పడినప్పటికీ, కొంతమందితో డేటింగ్ చేసినప్పటికీ అసలైన ప్రేమ అంటే ఏంటో తనకింకా అర్థం కాలేదని గతంలోనే ప్రకటించుకున్నాడు నవదీప్. ప్రస్తుతం ఈ హీరో “లవ్ మౌళి” అనే సినిమాతో మరోసారి తెరపైకొస్తున్నాడు. నవదీప్ కు ఇది దాదాపు రీఎంట్రీ లాంటిది.
ఈ సినిమా గురించి తాజాగా స్పందించిన నవదీప్.. “లవ్ మౌళి” సినిమాలో తన ప్రేమకథలు కూడా ఉన్నాయని స్పష్టం చేశాడు.
“నా పర్సనల్ లైఫ్‌లో నా ప్రేమకథలు, నా లవ్‌స్టోరీల్లో ఉన్న పాయింట్స్ ను కూడా టచ్ చేశాం. ఈ కథ, ఈ పాయింట్ కనెక్ట్ అయితే వాళ్ల పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలని ఉంది. ఈ 20 ఏళ్ల కెరీర్ తర్వాత నాలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన సినిమా ఇది.”
ఇలా ఈ సినిమాలో తన రియల్ లైఫ్ ప్రేమకథల్లోని పార్శ్వాలు కూడా ఉన్నట్టు బయటపెట్టాడు నవదీప్. గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో దీనికి విరుద్ధంగా స్పందించిన ఈ నటుడు, ఈసారి మాత్రం తన లవ్ స్టోరీలు కూడా “లవ్ మౌళి”లో ఉన్నాయని అంగీకరించడం విశేషం.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…