విశ్వక్ సేన్ తాజా చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు 31న థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకుడు.
నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో అంజలి పాల్గొంది. సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాన్ని బయటపెట్టింది.
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నాది, విశ్వక్ పాత్రల పాత్రల బంధం స్వీట్ గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. ఆయన రత్నాకర్, నేను రత్నమాల. ఇద్దరినీ రత్న అని పిలుస్తారు. నా ఆహార్యం, నేను పలికే సంభాషణలు కొత్తగా ఉంటాయి. మనసులో ఏది అనుకుంటే అది బయటకు చెప్పే పాత్ర. రత్నమాల నా సినీ కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది.”
“గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”లో తనది ప్రత్యేక పాత్ర కాదంటోంది అంజలి. నేహా శెట్టి ఓ హీరోయిన్ గా నటిస్తే, తను మరో హీరోయిన్ గా చేశానని చెబుతోంది.
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…