నిధి అగర్వాల్ చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడు ఆమె ఖాతాలో పడినవి కాదు. ఒకటేమో కరోనాకి ముందు వచ్చింది. ఇంకోటి రెండేళ్ల క్రితం దక్కింది. కానీ అవి ఇంకా పూర్తి కాలేదు. ఈ భామ ఆ రెండు సినిమాలపైనే ఆశలు పెట్టుకొని కూర్చొంది.
ఆ చిత్రాలు: 1) హరి హర వీర మల్లు 2) ది రాజా సాబ్.
‘హరి హర వీర మల్లు’ చిత్రం దాదాపు మూడున్నరేళ్లుగా నిర్మాణంలో ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ తీస్తున్న భారీ చిత్రం ఇది. ఈ సినిమాని నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ పై సీన్లతో మొదలు పెట్టారు. కానీ మధ్యలో పవన్ ఈ సినిమాని పక్కన పెట్టి “భీమ్లా నాయక్”, “బ్రో” సినిమాలు పూర్తి చెయ్యడంతో క్రిష్ ఈ గ్యాప్ లో “కొండపొలం” అనే సినిమా తీసి వదిలాడు. ఇప్పుడు అనుష్క హీరోయిన్ గా ‘గాటి’ అనే సినిమా తీస్తున్నాడు.
‘హరి హర వీర మల్లు’ పూర్తి అయి విడుదల కావాలంటే 2025 దాకా వెయిట్ చెయ్యాలి.
మరోవైపు ప్రభాస్ హీరోగా “ది రాజా సాబ్” అనే సినిమా కూడా అలా అలా సాగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి మెయిన్ హీరోయిన్. మరో భామ మాళవిక మోహనన్. తాజాగా ప్రభాస్ మళ్ళీ ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు. దాంతో, నిధి ఈ రోజు నుంచి షూటింగ్ లో మళ్ళీ పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుందో, ఎప్పుడు విడుదల అవుతుందో ఇప్పుడే చెప్పలేం.
ఐతే, నిధి ఈ రెండు సినిమాల కోసం మరో ఏడాది ఆగాలి. ‘హరి హర వీర మల్లు’ సంగతేమో గాని ‘ది రాజాసాబ్’ వచ్చే సంక్రాంతి లోపు విడుదల అవుతుంది.
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…