Categories: న్యూస్

‘టీచర్’గా క‌ల‌ర్స్ స్వాతి

కలర్స్ స్వాతి హీరోయిన్ గా మళ్ళీ బిజీ అవుతోంది. ఆమె డిఫెరెంట్ చిత్రాలను ఎంచుకుంటోంది. ఆమె కొత్తగా చేస్తోన్న మూవీ… టీచర్.

ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే కథనంతో తెరకెక్కుతోంది “టీచర్‌” అనే ఈ మూవీ. తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్‌ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు.

అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుంది.

ఇటీవల “90స్‌- ఎ మిడిల్‌ క్లాస్‌” బయోపిక్‌ తో బ్లాక్‌ బస్టర్‌ అందుకున్న టీమ్‌ నుంచి వస్తోంది ఈ సినిమా. ఆదిత్య హసన్‌ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్‌ మేడారం నిర్మించారు. ఎంఎన్‌ఓపీ (మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్) సంస్థ నిర్మిస్తోన్న రెండో సినిమా ఇది.

Admin

Recent Posts

Summer 2027: డ్రాగన్, వారణాసి, స్పిరిట్ చిత్రాలతో కలెక్షన్ల పండుగ

ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…

5 hours ago

Shalini Kondepudi: దర్శకురాలిగా మారబోతున్న హీరోయిన్

టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…

6 hours ago

Pooja Hegde: ఆమెకి కత్తెర వేశాను, దర్శకుడి వ్యాఖ్యలు వైరల్

తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…

6 hours ago

Mrunal Thakur: నాలుగేళ్ల కిందటి మూవీకి ఇప్పుడు మోక్షం

హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…

1 day ago

నాగవంశీకే డేట్ పాటించాలని చెప్పిన Akkineni Nagarjuna

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…

1 day ago

పోకిరి అంటే పిచ్చి అంటున్న Akhil Akkineni

రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…

2 days ago