పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేయడంలో ముందుంటాడు హీరో నితిన్. కొన్ని సందర్భాల్లో అతడి మేనరిజమ్స్ చూస్తే, క్లియర్ గా పవన్ ను ఫాలో అయిపోతున్నాడని ఇట్టే అర్థమైపోతుంది. అయితే దానికి నితిన్ నామోషీ ఫీల్ అవ్వడు. తను పవన్ కు వీరాభిమానినని, కొన్నిసార్లు అతడ్ని అనుకరిస్తుంటానని ఒప్పుకుంటాడు.
ఇప్పటికే పవన్ కల్యాణ్ పాటను రీమిక్స్ చేసిన ఈ నటుడు, ఇప్పుడు ఏకంగా పవన్ కల్యాణ్ సినిమా టైటిల్ వాడేస్తున్నాడు. అదే ‘తమ్ముడు’. అయితే గమ్మత్తుగా ఈ సినిమా టైటిల్ పెట్టొద్దని మేకర్స్ ను కోరాడట నితిన్.
పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమా ‘తమ్ముడు’. అలాంటి టైటిల్ ను తన సినిమా కోసం వాడేస్తే, ఒత్తిడి ఫీలవుతానని అన్నాడట. పైగా ఇప్పటికే పవన్ ను అనుకరిస్తున్నాననే రిమార్క్ ఉందని, ఇప్పుడు ఆయన సినిమా టైటిల్ ను కూడా కాపీ కొడితే పవన్ ఫ్యాన్స్ హర్ట్ అవుతారని అన్నాడట.
అయితే దర్శకుడు, నిర్మాత కలిసి నితిన్ ను ఒప్పించారట. ఈ కథకు ‘తమ్ముడు’ అనే టైటిల్ మాత్రమే సూట్ అవుతుందన్నారంట. అలా అయిష్టంగానే నితిన్ ఒప్పుకున్నాడట.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…