నివేత పేతురాజ్ (Nivetha Pethuraj) ఒకప్పుడు చాలా సినిమాలు చేసింది. కానీ వ్యక్తిగత జీవితంలో ఉన్న వివాదాల వల్ల ఎక్కువ సినిమాలు చెయ్యలేకపోయింది. ముఖ్యంగా తమిళనాట ఒక రాజకీయ నాయుడుతో ఉన్న సమస్య వల్ల ఆమె కెరీర్ కష్టాల్లో పడింది.
ఈ వివాదాలకు దూరంగా ఉండాలని ఆమె సినిమాలు మానేసి హాయిగా పెళ్లి చేసుకొని దుబాయ్ లో సెటిల్ అవుదామని ప్లాన్ చేసింది. ఆమె కుటుంబం మొత్తం చాలా ఏళ్ల క్రితమే దుబాయ్ కి షిఫ్ట్ అయింది. ఐతే, ఆమె పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తితో ఆమెకి ఎంగేజ్ మెంట్ తర్వాత గొడవలు వచ్చాయి. దాంతో పెళ్లి రద్దయింది. ఇద్దరూ పెళ్లి కాకముందే విడిపోయారు.
దాంతో ఆమె మళ్ళీ ఇండియాలోనే సినిమాల్లో తన దారి వెతుక్కోవాలని ప్రయత్నాలు సాగించడం మొదలు పెట్టింది. అదృష్టవశాత్తూ ఆమెకి ఒకటి కలిసి వచ్చింది. తమిళనాడులో డీఎంకె ప్రభుత్వం పోయింది. ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. హీరో విజయ్ కొత్త ముఖ్యమంత్రి అయ్యాడు.
తమిళనాట రాజకీయాలు మారిపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకొంది. ఆమెకి ఇప్పుడు ధైర్యం వచ్చింది అని చెప్తున్నారు. ఇక ఎడాపెడా సినిమాలు ఒప్పుకుంటుంది.
ఇప్పటికే వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆదర్శ కుటుంబం(Adarsha Kutumbam)లో రెండో హీరోయిన్ గా జాయిన్ అయిందట. నివేత పేతురాజ్ కొత్త ఇన్నింగ్స్ మొదలు అయినట్లే.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…