ఎట్టకేలకు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విజయవాడలో జరుగుతున్న “హరిహర వీరమల్లు” షూటింగ్ లో తనకు కుదిరినప్పుడు పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తన రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలు చూసుకుంటూ వీలు చిక్కినప్పుడు షూటింగ్ చేస్తున్నారు.
మార్చి 28 2025న “హరిహర వీరమల్లు” రిలీజ్ అవుతుంది.
ఇక తాజాగా “ఓజి” టీం కూడా షూటింగ్ మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ అవసరం లేని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ రెండు సినిమాలను చకా చకా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు డీసీఎం పవన్ కళ్యాణ్.
జూన్ తర్వాత “ఓజీ” సినిమా థియేటర్లలోకి వస్తుంది. ఇక కొద్ది రోజులు షూటింగ్ జరుపుకొని ఆగిపోయిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాను ఎప్పుడు ప్రారంభిస్తారో చూడాలి. ప్రస్తుతానికి “హరిహర వీరమల్లు”, “ఓజీ” సినిమాకు కాల్షీట్లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. అవి చకాచకా పూర్తి అయ్యేలా కనిపిస్తున్నాయి.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…