తనను దేవుడు అందంగా పుట్టించాడంటూ ఈమధ్య ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చింది రకుల్. అయితే ఆ అందంతో పాటు కూసింత అదృష్టం కూడా ఇచ్చుంటే బాగుండేది. ఆమె కెరీర్ కు అర్జెంట్ గా ఓ బూస్ట్ అవసరం.
రకుల్ తెలుగులో స్ట్రయిట్ సినిమా చేసి చాన్నాళ్లయింది. ఇంకా సూటిగా చెప్పాలంటే టాలీవుడ్ నుంచి ఆమెకు అవకాశాలు రావడం లేదు.
‘భారతీయుడు-2’ సినిమాతో సౌత్ లో మరోసారి పాపులర్ అవుదామనుకుంది ఈ బ్యూటీ. కానీ ఆ సినిమా ఆమె ఇమేజ్ ను, కెరీర్ ను మరింత డ్యామేజీ చేసింది తప్ప, ఒక్క శాతం కూడా కలిసిరాలేదు.
అటు బాలీవుడ్ లో ఆమె వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. అవకాశాలు కూడా అలానే వస్తున్నాయి. కానీ అక్కడ కూడా ఏదో వెలితి. సరైన సక్సెస్ రావడం లేదు. ఇలానే కొనసాగితే, కొన్నాళ్లకు బాలీవుడ్ తలుపులు కూడా మూసుకుపోతాయి.
ఈ టెన్షన్ రకుల్ కు కూడా ఉంది. అందుకే ఓవైపు హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తూనే, మరోవైపు బిజినెస్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది. పనిలోపనిగా దేవుడిచ్చిన అందాన్ని మరింత ఎలివేట్ చేస్తోంది.
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…