సమంత ఈ మధ్య హైదరాబాద్ లో కన్నా ముంబైలోనే ఎక్కువగా ఉంటోంది. ఎందుకంటే ఆమెకి యాడ్స్, ఫోటోషూట్స్, ఫ్యాషన్ మేగజైన్ లతో డీల్స్ అన్నీ అక్కడే. అందుకే ఆమె ఆల్మోస్ట్ తన మకాం ముంబైకి మార్చింది.
దానికి తోడు ఆమె కొత్త స్నేహితులు అంతా ముంబైలోనే ఉన్నారు. సో, నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ముంబైలోనే ఉంటోంది. అలాగే ఆమె బాలీవుడ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది అని చాలా ప్రచారం జరిగింది.
ఆమె బాలీవుడ్ సినిమాల మాటేమో కానీ ఇప్పటివరకు ఆమెకి ముంబైలో కేవలం వెబ్ సిరీస్ లు మాత్రమే దక్కాయి. ఆమె తన విడాకులకు ముందే “ఫ్యామిలీ మేన్ సీజన్ 2” అనే వెబ్ సిరీస్ లో నటించింది, సిరీస్ సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అదే మేకర్స్ తీసిన “సిటాడెల్ హనీ బన్నీ” అనే కొత్త వెబ్ సిరీస్ కూడా పూర్తి చేసింది ఇప్పుడు.
ఇక ఆమెకి వరుసగా బాలీవుడ్ లో సినిమా అవకాశాలు వస్తాయి అని అందరూ భావించారు. అక్షయ్ కుమార్ ఆమెని బాలీవుడ్ హీరోయిన్ గా పరిచయం చెయ్యనున్నాడు అనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆమె తన బాలీవుడ్ ప్రాజెక్ట్ ను ఎనౌన్స్ చేయలేకపోయింది
ఇక తెలుగులో ఆమె త్వరలోనే అల్లు అర్జున్ సరసన అట్లీ డైరెక్షన్లో ఒక మూవీ చెయ్యనుంది అనేది టాక్.
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…