హీరో సిద్ధార్థ్, హీరోయిన్ ఆదితి రావు ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్నారు. వనపర్తి సమీపంలోని శ్రీరంగపురంలోని శ్రీరంగనాయక దేవాలయంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఆ నిశ్చితార్థ వేడుక పెళ్లి వేడుకలా జరిగింది. దాంతో చాలామంది వారి పెళ్లి అయిపోయింది అనుకున్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళు క్లారిటీ ఇచ్చారు అది కేవలం ఎంగేజ్ మెంట్ అని.
ఇక ఇప్పుడు పెళ్లి ముహూర్తం గురించి స్పందించాడు హీరో సిద్ధార్థ్.
“మాది రహస్య వేడుక కాదు. మీడియా తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రైవేట్ కి, సీక్రెట్ కి వేర్వేరు అర్థాలు. మాది సీక్రెట్ గా జరిగిన ఎంగేజ్ మెంట్ కాదు. మా కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ గా జరిగిన వేడుక. ఇక పెళ్లి అంటారా ఆ తేదీని నిర్ణయించేది నేను కాదు, ఆదితి కాదు. మా పెద్దలు నిర్ణయిస్తారు. మంచి ముహూర్తం చూస్తున్నారు. సో, ముహూర్తం కుదిరినప్పుడు పెళ్లి జరుగుతుంది,” అని వివరణ ఇచ్చాడు.
“మహా సముద్రం” సినిమా షూటింగ్ సమయంలో వీరు ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి డేటింగ్ మొదలుపెట్టి సహజీవనం ప్రారంభించారు. మూడేళ్ళ ప్రేమకు ఎంగేజ్మెంట్ తో పెళ్లి దారి దొరికింది. త్వరలోనే పెళ్లి.
ఆదితి రావు ఇంతకుముందు సత్యదేవ్ మిశ్రా అనే నటుడిని పెళ్లాడింది. కానీ కొన్నేళ్ళకు వాళ్ళు విడిపోయారు. ఇక సిద్ధార్థ్ కూడా తన మొదటి గాళ్ ఫ్రెండ్ ని పెళ్ళాడి, విడాకులు తీసుకున్నాడు.
ఆదితికి ఇప్పుడు 37 ఏళ్ళు. సిద్ధూకి 44 ఏళ్ళు. సో, ఇప్పుడు ఇద్దరూ కొత్త జీవనప్రయాణం పారంభిస్తున్నారు.
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…