ఇప్పటికే వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతోంది. ఇప్పుడు మరో నెగెటివ్ సెంటిమెంట్ ను శ్రీలీలను చుట్టుముట్టింది. మరో హీరోయిన్ వదలేసిన సినిమాల్ని తను చేస్తూ కష్టాలు కొనితెచ్చుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.
ముందుగా దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలిచింది ‘గుంటూరుకారం’. ఈ సినిమాలో ముందుగా పూజాహెగ్డే హీరోయిన్. ఆమెను తప్పించి, ఆ స్థానంలో శ్రీలీలను హీరోయిన్ ను చేశారు. ఎక్కడా మిస్ ఫైర్ అయ్యే అవకాశమే లేనటువుంటి ప్రాజెక్ట్ అది. కానీ మిస్ ఫైర్ అయింది. శ్రీలీలకు ఆ సినిమా విడుదలైన తర్వాత తెలుగులో మరో పెద్ద సినిమా రాలేదు.
అలాగే, పూజ హెగ్డే చెయ్యాల్సిన “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమాలో శ్రీలీల చేరింది. ఆ సినిమా రెండుళ్లుగా అలా ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేం.
తాజాగా ‘రాబిన్ హుడ్’. నిజానికి ఇది కూడా శ్రీలీల చేయాల్సిన సినిమా కాదు. ఇందులో ముందుగా రష్మికను అనుకున్నారు. ఆమె ప్రొమోషన్ షూట్ కూడా చేసింది. కొన్ని కారణాల వల్ల రష్మిక తప్పుకుంది. ఆ స్థానంలోకి శ్రీలీల వచ్చి చేరింది.
గత వీకెండ్ థియేటర్లలోకి వచ్చిన ‘రాబిన్ హుడ్’కి నెగెటివ్ రిజల్ట్ వచ్చింది.
ఇలా మరో హీరోయిన్ చేయాల్సిన సినిమాల్ని ఇకపై శ్రీలీల అంగీకరించకపోవడమే మంచిదంటున్నారు ఆమె ఫ్యాన్స్. కోరి కష్టాలు తెచ్చుకోవద్దు అని చెప్తున్నారు.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…