Categories: అవీ ఇవీ

సందీప్ ఆరోగ్య సమస్య ఇది!

హీరోహీరోయిన్లు కూడా మనుషులే. వాళ్లకూ ఆరోగ్య సమస్యలుంటాయి. అయితే కొందరు పైకి చెప్పుకుంటారు, మరికొందరు మాత్రం చెప్పుకోరు. సీక్రెట్ గా విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని వస్తుంటారు. సందీప్ కిషన్ మాత్రం అంతా ఓపెన్.

తన ఆరోగ్య సమస్యను తానే బయటపెట్టాడు సందీప్ కిషన్. ఈ హీరోకు తీవ్రమైన సైనస్ సమస్య ఉందట. దాని వల్ల మెడ-తల చుట్టూ విపరీతమైన పెయిన్ వస్తుందని చెప్పుకొచ్చాడు. అది మందులతో పోయేది కాదంట. కచ్చితంగా సర్జరీ చేయాల్సిందేనంట.

ఈ సమస్య వల్ల ఒక్కోసారి తను చిరాగ్గా ఉంటానని, ఆ టైమ్ లో తనను చూసిన వాళ్లు సహచర నటీనటులు, టెక్నీషియన్స్ తో సరిగ్గా ఉండనంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చాడు. షాట్ గ్యాప్ లో కారవాన్ లోకి వెళ్లిపోతాడని, ఎవ్వరితో కలవడనే రూమర్స్ కూడా ఉన్నాయి. వీటికి కూడా కారణం సైనస్ అని, కారవాన్ లోకి వెళ్లి ఓ  అరగంట పడుకుంటే రిలాక్స్ గా ఉంటుందని చెబుతున్నాడు.

సర్జరీ అంటే తనకు భయమని, పైగా ఇన్నాళ్లూ బిజీగా ఉండడం వల్ల సర్జరీ గురించి ఆలోచించలేదని అన్నాడు. “మజాకా” సినిమా రిలీజ్ తర్వాత తన ఆరోగ్యంపై దృష్టిపెడతానంటున్నాడు ఈ హీరో. 

Admin

Recent Posts

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

17 hours ago

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…

23 hours ago

Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…

24 hours ago

Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…

24 hours ago

హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram

'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…

2 days ago

Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…

2 days ago