“మేడమ్ సార్, మేడమ్ అంతే” అనేది తెలుగులో పాపులర్ డైలాగ్. పూజా హెగ్డేను చూసిన ప్రతిసారి ఈ డైలాగ్ గుర్తొస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు తెలుగు చిత్రసీమకు దాదాపు దూరమైంది. వచ్చినట్టే వచ్చి అవకాశాలు చేజారిపోతున్నాయి.
ఇలా టాలీవుడ్ కు దూరమైపోతోందంటూ ఓవైపు మాట్లాడుకుంటుండగానే, మరోవైపు కోలీవుడ్ లో తన హవా చూపిస్తోంది పూజా. సూర్య సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇక విజయ్ సరసన ‘జన నాయగన్’ అనే సినిమా కూడా చేస్తోంది. ఈ రెండూ పెద్ద సినిమాలే.
వీటికి అదనంగా రజనీకాంత్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం దక్కించుకుంది. లోకేష్ కనగరాజ్ సినిమా ఇది. ఇక త్వరలోనే ఆమె లారెన్స్ సరసన కూడా నటించబోతోంది. ఇలా కోలీవుడ్ లో ఒక్కసారిగా బిజీ అయింది పూజాహెగ్డే.
ఈ సినిమాలు ఎలాగూ తెలుగులోకి కూడా డబ్ అవుతాయి కాబట్టి, వీటితో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆమె పలకరించడం గ్యారెంటీ. ఈలోగా తెలుగులో కూడా అవకాశాలొస్తే, ఇక్కడ కూడా ‘మేడమ్’ హవా మళ్లీ మొదలైనట్టే.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…