రానురాను ఏది క్రేజ్, ఏది హైప్ అనేది తెలియట్లేదు. హీరో ఎదురుపడితే ఈలలు-గోలలు. అరుపులు-కేకలు. ఫ్లెక్సీలతో తోపులాటలు. సందు దొరికితే స్టేజ్ ఎక్కేసి హీరో కాళ్లపై పడిపోవడాలు. ఇలా కళ్ల ముందు కనిపించే సన్నివేశాల్లో నిజం ఎంత?
ఇలాంటి సన్నివేశాలన్నింటినీ ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి వస్తోంది. వీటితో పాటు సోషల్ మీడియాలో కనిపించే ట్రెండింగ్ లు, నంబర్లను కూడా ప్రశ్నార్థకంగా చూడాల్సి వస్తోంది. దీనికి కారణం కొంతమంది హీరోల సినిమాలు సాధిస్తున్న వసూళ్లు.
ఉదాహరణకు విశ్వక్ సేన్ నే తీసుకుందాం. ఇతడి సినిమా ఫంక్షన్లకు వచ్చే జనం చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఈయన మాటల కంటే, ఈయన అభిమానులమని చెప్పుకునే జనం అరుపులు ఎక్కువగా హైలెట్ అవుతుంటాయి.
విశ్వక్ కు ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యపోయేలా ఉంటుంది ఆ హడావుడి. కట్ చేస్తే, అతడు నటించిన ‘లైలా’ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. విశ్వక్ కోసం గొంతు చించుకొని అరిచే ఆ బ్యాచ్ థియేటర్లకు వచ్చినా, ఈ సినిమాకు నామమాత్రపు వసూళ్లు వచ్చి ఉండేవేమో.
గతంలో విజయ్ దేవరకొండ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడి క్రేజ్ ఆలిండియా లెవెల్ కు పాకిందని అంతా అనుకున్నారు. ‘లైగర్’ రిజల్ట్ చూసిన తర్వాత ఎవరి అనుమానాలు వాళ్లకు కలిగాయి. ‘ది ఫ్యామిలీ స్టార్’ రిలీజైన తర్వాత చాలామందికి క్లారిటీ వచ్చింది.
ఇప్పుడీ లిస్ట్ లో తాజాగా చేరిన వ్యక్తి సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లూ’, ‘టిల్లూ స్క్వేర్’ సినిమాలతో సిద్ధుకు యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ వచ్చిందన్నారు చాలామంది. మరి ఆ యూత్ అంతా ఏమైపోయింది.. ఎటెళ్లిపోయింది? ‘జాక్’ సినిమాకు ఓపెనింగ్స్ ఎందుకు రాలేదు?
సినిమా హిట్టయిందా ఫ్లాప్ అయిందా అనేది తర్వాత సంగతి. ఓ స్టార్ నటించిన సినిమా వస్తుందంటే ఓపెనింగ్స్ అదిరిపోవాలి. కానీ కొంతమంది హీరోలకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నంత క్రేజ్.. ఓపెనింగ్స్ లో కనిపించడం లేదు. ఈ రెండింటికి మధ్యలో భారీ గ్యాప్ కనిపిస్తోంది. ఆ గ్యాప్ నే స్టార్ డమ్ అంటారేమో.
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…
రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…