ప్రభాస్, దర్శకుడు సందీప్ వంగా కాంబినేషన్ లో రానున్న “స్పిరిట్” చిత్రం మరింత ఆలస్యం కానుంది. ఈ సినిమా నిజానికి జనవరిలోనే ప్రారంభం కావాలి. కానీ ప్రభాస్ ఇతర చిత్రాల కారణంగా ఏప్రిల్ లో ప్రారంభిద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఆ డేట్ కూడా మారింది.
తాజా సమాచారం ప్రకారం అక్టోబర్లో మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది దసరా తర్వాతే వంగా షూటింగ్ మొదలవుతుంది.
రణబీర్ కపూర్ తో “యానిమల్” వంటి భారీ బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత ప్రభాస్ తో సినిమా మొదలుపెట్టేందుకు రెండేళ్లు ఆగాల్సి వస్తోంది సందీప్ కి. “యానిమల్” మూవీ 2023 డిసెంబర్లో విడుదల అయింది. ఎప్పుడో స్క్రిప్ట్ పూర్తి చేశాడు. కానీ ప్రభాస్ నటిస్తున్న “రాజా సాబ్” షూటింగ్ చాలా ఆలస్యం కావడం, దానికి తోడు తన సినిమా కోసం మొత్తం లుక్ మార్చాలి అని వంగా పట్టుబట్టడంతో ప్రభాస్ మరింత సమయం కావాలి అని అడిగాడట.
మారుతి తీస్తున్న “రాజాసాబ్”తో పాటు దర్శకుడు హను రాఘవపూడి తీస్తున్న “ఫౌజి” సినిమా కూడా పూర్తి చేసుకున్నాకే ప్రభాస్ వంగా సినిమా స్టార్ట్ చేస్తాడు.
ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…
నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…
బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…
అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…
గత ఏడాది పూజ హెగ్డే (Pooja Hegde) ఒకేసారి మూడు, నాలుగు సినిమాలు ఒప్పుకొంది. కానీ వాటి విడుదల చాలా…
ఇటీవల మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీమణుల్లో బాగా పాపులర్ అయిన నటి…అన్నా రాజన్ (Anna Raajan). ఆమె నటన…