బాలీవుడ్ హీరోల మార్కెట్ లో బాలీవుడ్ హీరోలని మించి పాపులారిటీ పొందడం అంటే మాటలు కాదు. “బాహుబలి”తోనే ప్రభాస్ కి నార్త్ ఇండియా మార్కెట్ లో క్రేజ్ వచ్చింది. ఐతే ఆ తర్వాత వచ్చిన సినిమాలు కొన్ని ఆడాయి, కొన్ని ఆడలేదు. కానీ ప్రతి సినిమా నార్త్ ఇండియాలో మంచి ఓపెనింగ్ సాధించింది.
“సలార్” వంటి సినిమాలు షారుక్ ఖాన్ సినిమాలతో పోటీ పడి మరీ భారీ కలెక్షన్లు పొందాయి. అప్పుడే అందరికీ అర్థమైంది ప్రభాస్ స్టార్డం నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ అని. ఐతే “కల్కి 2898 AD” సినిమా విజయం మాత్రం ప్రత్యేకం. ఇటీవల బాలీవుడ్ లో హృతిక్ రోషన్ వంటి బడా హీరోల సినిమాలు కూడా పెద్దగా నిలబడలేకపోయాయి. ఇలాంటి టైంలో ఈ సినిమా విడుదలై ఐదు రోజుల్లో 125 కోట్లు కొల్లగొట్టింది.
ఇప్పుడు ప్రభాస్ ఇండియాలో నంబర్ వన్ హీరో అని చెప్పొచ్చు. ఈ రేంజ్ లో అన్ని చోట్లా మార్కెట్ ఉన్న మరో దక్షిణాది హీరో లేడు. షారుక్ ఖాన్ వంటి హీరోలకు భారీ క్రేజ్ ఉన్న మాట వాస్తవమే కానీ ప్రభాస్ ఎలాంటి జానర్ సినిమాతోనైనా ఓపెనింగ్స్ తీసుకురావడంలో కింగ్ అని నిరూపించుకుంటున్నారు.
ప్రభాస్ కన్నా ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తున్న హీరోలు దక్షిణాది చిత్రసీమలో ఉన్నారు. కానీ విచిత్రం ఏమిటంటే వాళ్ళకెవరికీ ప్రభాస్ లా నార్త్ ఇండియాలో క్రేజ్ లేదు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…