ఫీచర్లు

Sankranthi 2027: సంక్రాంతికి తప్ప హిట్ కొట్టలేరా?

వచ్చే సంక్రాంతి (Sankranthi 2027)కి ఇప్పటికే ఏడు సినిమాలు కర్చీఫ్ వేశాయి. అందులో ఏడు చిత్రాల్లో నాలుగు చిత్రాలు నలుగురు సీనియర్ హీరోల సినిమాలే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వచ్చే సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చెయ్యాలనే లక్ష్యంతో ఉన్నారు.

చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి “మన శంకర వర ప్రసాద్ గారు” తీసుకొచ్చారు. ఆ సినిమా తన కెరీర్ లోనే అతిపెద్ద వసూళ్లు అందుకున్న చిత్రంగా నిలిచింది. అందుకే, అలాగే “వాల్తేర్ వీరయ్య” చిత్రం కూడా సంకాంతి సీజన్లోనే వచ్చి విడుదల అయింది. మిగతా టైంలో విడుదలైన ఆచార్య, భోళా శంకర్, గాడ్ ఫాదర్ చిత్రాలు ఆడలేదు. దాంతో, తన సినిమాలు సంక్రాంతికే పెద్ద హిట్ అవుతాయి అనే సెంటిమెంట్ పెరిగింది మెగాస్టార్ చిరంజీవికి.

అందుకే దర్శకుడు బాబీతో కలిసి చేస్తున్న కొత్త చిత్రాన్ని సంక్రాంతి 2027 బరిలో దింపాలని ఫిక్స్ అయ్యారట.

నందమూరి బాలకృష్ణ ఇటీవల మంచి విజయాలు చూశారు. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన “అఖండ 2” బోల్తా కొట్టింది. దాంతో తన సినిమాల విషయంలో బాలయ్య డైలమాలో పడ్డారు. దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక భారీ చిత్రం ప్రారంభించారు. కానీ ‘అఖండ 2’ ఫ్లాప్ తర్వాత దాన్ని ఆపేసి మరో కథ తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే నెలలో మొదలుపెట్టి సంక్రాంతి 2027కే విడుదల చెయ్యాలనుకుంటున్నారు.

వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన “వీర సింహా రెడ్డి” కూడా సంక్రాంతి సమయంలోనే విడుదలయింది. అదే సెంటిమెంట్ ఇప్పుడు పాటిస్తున్నారు.

నాగార్జున

సీనియర్ హీరోల్లో సోలో హీరోగా ఇటీవలి కాలంలో ఒక్క హిట్ అందుకొని ఏకైక హీరో… నాగార్జున. ఆయన ఇటీవల కాలంలో సోలో హీరోగా నటించిన చిత్రాలు: మన్మధుడు 2, ది ఘోస్ట్, వైల్డ్ డాగ్. అన్నీ ఫ్లాపులే. ఇటీవల సక్సెస్ చూసిన చిత్రం… నా సామి రంగా. అది సంక్రాంతికి వచ్చింది. ఇక నాగార్జునకి అర్థమైంది తన చిత్రాలకు పొంగల్ ఫెస్టివల్ బెస్ట్ టైం అని.

అందుకే, సంక్రాంతి 2027కి మరోసారి సోగ్గాడు చిన్నినాయన, బంగార్రాజు చిత్రాల్లో పోషించిన పాత్రతోనే మరోసారి వస్తాను అని ప్రకటించాడు నాగార్జున.

వెంకటేష్

వెంకటేష్ కెరీర్లో అతిపెద్ద హిట్ చిత్రం.. 2025 సంక్రాంతికి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం.” అనిల్ రావిపూడి తీసిన ఈ చిత్రం దాదాపు 250 కోట్లు కలెక్ట్ చేసింది. వెంకటేష్ కి ఇది కలలో కూడా ఊహించని వసూల్. అందుకే, అనిల్ రావిపూడిని వెంకటేష్ వదలడం లేదు. రావిపూడి తీసిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’లో గెస్ట్ రోల్ చేసి మరో సంక్రాంతి హిట్ ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ హీరోగా మళ్ళీ ఈ దర్శకుడితోనే 2027 సంక్రాంతికి రానున్నాడు.

TeluguCinema Team

TeluguCinema Desk is the editorial team behind TeluguCinema.com, one of the oldest and most trusted websites dedicated to the Telugu film industry since the late 1990s. With decades of experience in entertainment journalism, the team is committed to delivering accurate news, credible reports, exclusive updates, and insightful features while upholding the highest standards of fairness, authenticity, and journalistic integrity.

Recent Posts

Jaya Krishna Ghattamaneni: మొదటి చిత్రం…మొదటి ముచ్చట్లు

జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…

22 hours ago

Kavya Thapar: అందాల ఆరబోతలో నర్గీస్ తో పోటీ

కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…

1 day ago

Sri Gouri Priya: తెలుగు అమ్మాయికి గుర్తింపు వచ్చింది!

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…

1 day ago

Nara Brahmani: ‘సర్జరీ పూర్తయింది, నాన్న ఎనర్జీతో ఉన్నారు

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…

1 day ago

హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram

'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…

2 days ago

Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…

2 days ago