వేసవి సెలవులు తెలుగు సినిమాకి పెద్ద వ్యాపార సీజన్. ప్రతి వేసవిలో పెద్ద పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. గతంలో ప్రతి వారం ఒక బడా లేదా మీడియం రేంజ్ సినిమా విడుదల అయ్యేవి. కానీ ఈ సారి వేసవి మొత్తం వేస్ట్ అవుతోంది.
ఏప్రిల్ లో విడుదలైన ఒకే ఒక్క పెద్ద/మీడియం రేంజ్ చిత్రం… విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్”. సినిమా దారుణ పరాజయం పాలైంది. రెండో వారంలో విడుదలైన “గీతాంజలి మళ్ళీ వచ్చింది” కూడా ఢమాల్. ఇక మూడోవారంలో వచ్చిన చిత్రాలైన “పారిజాత పర్వం”, “టెనెంట్” వంటి వాటికి దిక్కే లేదు. వాటిని ఎవరూ పట్టించుకోలేదు.
వచ్చే వారం “ప్రతినిధి 2” అనే రాజకీయ చిత్రం, “రత్నం” వంటి డబ్బింగ్ చిత్రాలు వస్తున్నాయి.
మే నెలలో విడుదల కానున్న చిత్రాలు ఇవి: ఆ ఒక్కటీ అడక్కు, కృష్ణమ్మ, జితేందర్ రెడ్డి, ప్రసన్న వదనం, బాక్, శబరి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇందులో అల్లరి నరేష్ నటించిన “ఆ ఒక్కటీ అడక్కు”, విశ్వక్ సేన్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” మాత్రమే కాస్త అంచనాలు ఉన్న చిత్రాలు.
ఏప్రిల్, మే మొత్తంలో పెద్ద మూవీ ఒక్కటీ లేదు. ప్రభాస్ మూవీ “కల్కి” వాయిదా పడడం పెద్ద మైనస్. ఆ విధంగా 2024 వేసవి మొత్తంగా వృధా అవుతోంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…