సమ్మర్ బాక్సాఫీస్ మరీ దారుణంగా తయారైంది. మార్చి నెలలో ‘కోర్ట్’, ‘మ్యాడ్ స్క్వేర్’ మాత్రమే ఆడాయి. ఏప్రిల్ లో సూపర్ హిట్టవుతుందనుకున్న ‘జాక్’ చతికిలపడింది. ‘ఓదెల-2’ 3 రోజులకే దుకాణం సర్దేసింది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా క్రేజ్ ను నిలబెట్టుకోలేకపోయింది. ‘సారంగపాణి జాతకం’ కి మంచి రివ్యూలు వచ్చాయి కానీ డబ్బులు రాలేదు.
ఇలా కీలకమైన సమ్మర్ లో టాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేదు. ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయాయి. ఇక మిగిలింది మే నెల మాత్రమే. టాలీవుడ్ ఆశలన్నీ ఈ నెలపైనే ఉన్నాయి.
మే కూడా నిరాశపరిస్తే, టాలీవుడ్ కచ్చితంగా స్లంప్ లోకి జారుకుంటుంది. సక్సెస్ పర్సంటేజ్ మరింత పడిపోతుంది.
మే నెల మొదటి వారంలో, అంటే మరో 2 రోజుల్లో ‘హిట్-3’, ‘రెట్రో’ సినిమాలొస్తున్నాయి. నాని నటించిన ‘హిట్-3’పై భారీ అంచనాలున్నాయి. ప్రచారంతో పిచ్చెక్కిస్తున్న ఈ సినిమా, థియేటర్లలో క్లిక్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు.
ఇక రెండో వారంలో ‘సింగిల్’, ‘శుభం’, ‘ఎలెవెన్’ సినిమాలొస్తున్నాయి. వీటిలో సమంత నిర్మించిన ‘శుభం’ సినిమాపై పెద్దగా అంచనాల్లేకపోయినా.. శ్రీవిష్ణు నటించిన ‘సింగిల్’ సినిమాపై ట్రయిలర్ కారణంగా ఓ మోస్తరు అంచనాలు పెరిగాయి. పైగా అల్లు అరవింద్ చలవతో ఈ సినిమాకు భారీగా థియేటర్లు కూడా దక్కాయి.
ఇక మే నెల చివరి వారంలో ‘కింగ్ డమ్’ సినిమా వస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మే నెలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో ఎన్ని క్లిక్ అవుతాయో చూడాలి.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…