Categories: ఫీచర్లు

పిల్ల తల్లులు … పని గంటలు!

ఒకప్పుడు హీరోయిన్ కి పెళ్లి ఐతే చాలు క్రేజ్ పోయేది. అవకాశాలు తగ్గిపోయాయి. 20 ఏళ్ల క్రితమే అలాంటి ట్రెండ్ పోయింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగారు ఐశ్వర్య రాయ్ వంటి తారామణులు. ఇక ఇప్పుడు తల్లి అయ్యాక కూడా నటిస్తున్నారు. తల్లి అయ్యాక కూడా హీరోయిన్ గానే కొనసాగుతున్నారు పలువురు భామలు.

ప్రెగ్నన్సీ లీవ్ తీసుకొని డెలివరీ తర్వాత ఏడాది తరవాత ఫిట్ నెస్ చేసుకొని మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు పొందిన వారి లిస్ట్ పెద్దదే. ఇటీవల మనం కాజల్ అగర్వాల్ ని చూశాం. ఆమె తన కొడుకు పుట్టిన నాలుగు నెలలకే సినిమాల్లోకి వచ్చింది. బాలయ్య సరసన “భగవంత్ కేసరి” సినిమాలో నటించింది.

ఐతే పిల్ల తల్లులతో ఎన్ని గంటలు చేయించాలి అనే విషయంలో హాలీవుడ్ లో పెద్ద గొడవే చాలా కాలంగా జరుగుతోంది. అది ఇప్పుడు మన తెలుగు సినిమా పరిశ్రమకి చేరుకొంది.

దీపిక పదుకోన్ గంటల నిబంధన

దీపిక పదుకోన్ గతేడాది ఒక పాపకి జన్మనిచ్చింది. ఇప్పుడు రీ-ఎంట్రీకి సిద్ధమైంది. తెలుగులో ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ సినిమాకి ఆమెని తీసుకోవాలనుకున్నారు. కానీ భారీ పారితోషికంతో పాటు 6 గంటలే పని చేస్తాను అని దీపిక కండీషన్ పెట్టిందట. తన కూతురిని చూసుకోవాలి కాబట్టి 6, 7 గంటల కన్నా ఎక్కువ పని చేయలేనని చెప్పిందట. కానీ దర్శకుడు ఒప్పుకోలేదు.

ఆ సినిమా స్థానంలో ఆమెకి అల్లు అర్జున్ – అట్లీ సినిమా దక్కింది. ఈ ప్రాజెక్ట్ లో కొన్ని రోజులు ఆరు గంటలు, కొన్ని రోజులు ఎనిమిది గణాలు చేసేందుకు అంగీకరించిందట. అంతకుమించి అవసరం లేదు అని టీం ఒప్పుకొంది.

10 గంటలు పని చేస్తున్నా: జెనీలియా

తాజాగా అమీర్ ఖాన్ సరసన నటించింది జెనీలియా దేశముఖ్. ఆమెకి ఇద్దరు పిల్లలు. ఐతే, అమీర్ ఖాన్ సినిమాకి ఆమె ఏకంగా ప్రతిరోజూ 10 గంటల పనిచేసింది.

సినిమా సెట్ లో అనుకున్న టైంకి ఏది సెట్ కాదు. మేకప్, లైటింగ్, అనేక టేకులు… ఇలా షూటింగ్ ఆలస్యం అవుతూ ఉంటుంది. కొందరికి కొన్నిసార్లు మూడు నాలుగు గంటల్లోనే ఆ రోజు పని అయిపోతుంది. కొన్నిసార్లు 15 గంటలు అయినా అవదు. అందుకే, మినిమమ్ 9 గంటల షిఫ్ట్, కాల్షీట్ పెడుతారు.

కాజల్ అగర్వాల్ కి ఇబ్బంది లేదు

కాజల్ అగర్వాల్ తన తల్లిని సెట్ కి తీసుకొస్తోంది. స్టాఫ్ కూడా ఉంటారు. అందుకే ఆమె ఇలాంటి నిబంధన పెట్టడం లేదు.

Admin

Recent Posts

Samantha: మాతృత్వంపై, పిల్లలపై అభిప్రాయం ఇదే!

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…

2 hours ago

Irumudi: రవితేజ సినిమాలో పెద్ద ట్విస్ట్ ఉంటుందట!

"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…

8 hours ago

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా అటకెక్కిందా?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…

8 hours ago

Priyanka Mohan: ఓజీ బ్యూటీ డీ-గ్లామర్ రోల్లో!

గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…

10 hours ago

Sai Tej: ఇంకెక్కడ నాకు పెళ్లి అవుతుంది?

సాయిదుర్గతేజ్ పెళ్లి మేటర్ ఇప్పటిది కాదు. సమయం, సందర్భం లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు సాయితేజ్ పెళ్లి టాపిక్ తెరపైకి వస్తూనే…

1 day ago

Varshini Sounderajan: సాగరతీరంలో వర్షించిన అందం

బుల్లితెరపై యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వర్షిణి సౌందరరాజన్ (Varshini Sounderajan) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  పేరుకు…

1 day ago